ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీ రాణి మౌర్య కొవిడ్ బారిన పడ్డారు. ఆదివారం నిర్వహించిన పరీక్షలో ఆమెకు పాజిటివ్‌గా తేలింది. ట్విట్టర్ వేదికగా ఆమె ఈ విషయాన్ని తెలిపారు. తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరారు.
"కరోనా పరీక్షలో నాకు పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. లక్షణాలు ఏమీ లేవు. వైద్యుల పర్యవేక్షణలో ఐసోలేషన్‌లో ఉంటున్నాను. కొద్దిరోజులుగా నన్ను కలిసినవారు పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను."
-- బేబీ రాణి మౌర్య, ఉత్తరాఖండ్ గవర్నర్
వారం రోజుల పాటు ఆగ్రా పర్యటనకు వెళ్లిన గవర్నర్ బేబీ రాణి మౌర్య.. ఉత్తరాఖండ్‌కు శుక్రవారమే తిరిగి వచ్చారని రాజ్ భవన్ వెల్లడించింది. శని, ఆదివారం సెలవులు కాగా రాజ్‌భవన్ కార్యాలయం మూసి ఉంది. అధికారులు, ఉద్యోగులను గవర్నర్ కలవనందున.. గవర్నర్ సచివాలయ కార్యకలపాలు యథావిధిగా జరగనున్నాయి.
ఉత్తరాఖండ్‌లో ఆదివారం కొత్తగా 466 మంది వైరస్ బారిన పడ్డారు. మెత్తం కేసుల సంఖ్య 71,526కు చేరింది.