తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సోనియా గాంధీ, మాయావతికి భారతరత్న ఇవ్వాలి'

కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ, బీఎస్పీ అధినేత్రి మాయావతికి.. ఈ ఏడాది భారతరత్న పురస్కారాన్ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు కాంగ్రెస్​ సీనియర్​ నేత హరీశ్​ రావత్​. దేశంలో వారి సేవలు ఎనలేనివని కొనియాడారు.

Uttarakhand Former CM Harish Rawat demand to give the Bharataratna Award for Sona and Mayavathi
'సోనియా, మాయావతిలకు భారతరత్న ఇవ్వాలి'

By

Published : Jan 6, 2021, 5:21 AM IST

దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ఈ ఏడాదికి గానూ.. కాంగ్రెస్​ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఇవ్వాలని ఉత్తరాఖండ్​ మాజీ సీఎం, సీనియర్​ నాయకుడు హరీశ్​ రావత్​ డిమాండ్​ చేశారు. ఆమెతో పాటు బహుజన సమాజ్​ పార్టీ(బీఎస్పీ​) అధినేత్రి మాయావతికీ ప్రదానం చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీని కోరారు రావత్​.

హరీశ్​ రావత్​ ట్వీట్​

"సోనియా గాంధీ, మాయావతులిద్దరూ రాజకీయంలో ఉద్దండులు. ఈ విషయంలో ఏకీవభించినా, విభేదించినా పర్వాలేదు. కానీ, సోనియాజీ మాత్రం ఓ భారతీయ మహిళ అనే విషయాన్ని అంగీకరించాల్సిందే. అంకిత భావం, అద్భుతమైన ప్రజాదరణతో దేశం గర్వించేస్థాయికి ఎదిగారామె. కాబట్టి.. ప్రభుత్వం వీరికి భారతరత్న ఇచ్చి గౌరవించాలి."

- హరీశ్​ రావత్​, ఉత్తరాఖండ్​ మాజీ ముఖ్యమంత్రి

కాంగ్రెస్​, మాయావతితో పాటు రాహుల్​ గాంధీలను ట్యాగ్​ చేశారు రావత్​. అయితే.. ఆయన డిమాండ్​ పట్ల పలువురు ఆశ్చర్యపోయారు. భారతరత్న పురస్కారాన్ని సోనియాకు ఇవ్వాలన్న ప్రతిపాదన బాగానే ఉన్నా.. ఇందులో మాయావతి పేరును చేర్చడం గమనార్హం.

ఇదీ చదవండి:'ఆ అనుమతులు వచ్చాకే సెంట్రల్​ విస్టా నిర్మాణం'

ABOUT THE AUTHOR

...view details