తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సోనూసూద్​కు ఆ ముఖ్యమంత్రి కృతజ్ఞతలు - Uttarakhand CM Trivendra Singh Rawat today news

ముంబయిలో చిక్కుకున్న వలస కార్మికులను స్వరాష్ట్రానికి చేర్చేందుకు కృషి చేసిన బాలీవుడ్​ నటుడు సోనూసూద్​కు ఉత్తరాఖండ్​ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్​​ కృతజ్ఞతలు తెలిపారు. అతడి సాయాన్ని మెచ్చిన సీఎం.. తమ రాష్ట్రానికి రావాలని ఆహ్వానించారు.

Uttarakhand CM than0ks Sonu Sood for sending back migrants in chartered flight
సోనూసూద్​కు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు

By

Published : Jun 6, 2020, 8:37 PM IST

Updated : Jun 6, 2020, 9:39 PM IST

వలస కూలీల కష్టాలు తీరుస్తున్న బాలీవుడ్​ నటుడు సోనూసూద్​పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు దేశప్రజలు. ఈ జాబితాలోకి ప్రముఖ రాజకీయ నేతలు కూడా చేరుతున్నారు. తాజాగా.. లాక్​డౌన్​ కారణంగా ముంబయిలో చిక్కుకున్న తమ రాష్ట్ర​ కూలీలను చార్టర్డ్​ ఫ్లైట్​ ద్వారా స్వరాష్ట్రానికి తరలించేందుకు కృషి చేసిన సోనూసూద్​కు ఉత్తరాఖండ్​ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్​ రావత్​ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సోనూతో ఫోన్​లో మాట్లాడినట్లు వెల్లడించారు.

'మానవతా దృక్పథంతో సమాజ సేవ చేసిన సోనూసూద్​కు కృతజ్ఞతలు. అతనితో పాటు వలస కూలీలను సొంత రాష్ట్రాలకు తరలించేందుకు కృషిచేసిన అన్ని సామాజిక సంస్థలకు అభినందనలు.'

- త్రివేంద్ర సింగ్​ రావత్​, ఉత్తరాఖండ్​ ముఖ్యమంత్రి

కరోనా సంక్షోభం ముగిసిన తర్వాత తమ రాష్ట్రానికి రావాలని సోనూసూద్​ను ఆహ్వానించినట్లు తెలిపారు సీఎం.

సోనూ స్పందన..

ముఖ్యమంత్రి మాటలు తనకు మరింత బలాన్ని అందించాయని తెలిపారు సోనూసూద్​. త్వరలోనే బద్రీ-కేదార్​నాథ్​ దర్శనానికి వస్తానని, ఆ సమయంలో ముఖ్యమంత్రిని కలుస్తానని ట్వీట్​ చేశారు.

ఇదీ చదవండి:ఇంట్లో దూరిన ఎగిరేపాము.. పట్టుకోలేక ఆపసోపాలు!

Last Updated : Jun 6, 2020, 9:39 PM IST

ABOUT THE AUTHOR

...view details