ఉత్తారాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చమోలి జిల్లా గైర్సైణ్ను వేసవి కాల రాజధానిగా ఎంపిక చేస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు. దెహ్రాదూన్ రాజధానిగా యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.
గైర్సైణ్లో నిర్వహించిన బడ్జెట్ సమావేశాల్లోనే రెండో రాజధానిపై ప్రకటన చేశారు రావత్.
3 దశాబ్దాలుగా డిమాండ్లు...
1990లలో ఉత్తరాఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరిగినప్పుడే కొండ ప్రాంతమైన గైర్సైణ్ను రాజధానిగా చేయాలన్న డిమాండ్లు బలంగా వినిపించాయి. కానీ ఆ విషయంపై రాజకీయ పార్టీలు ఎప్పుడూ ఎలాంటి హామీ ఇవ్వలేదు. శాసనసభ సమావేశాలు మాత్రం అప్పుడప్పుడు గైర్సైణ్లో జరుగుతూ ఉంటాయి. రావత్ తాజా నిర్ణయంతో అక్కడి ప్రజల డిమాండ్ పాక్షికంగా నెరవేరినట్టయింది.
ఇదీ చూడండి:కరోనా కలవరం... భారత్లో ఇప్పటివరకు 28 కేసులు