ఉత్తర్ప్రదేశ్ బదాయూలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. భార్యను కొట్టి, ఇంట్లో బంధించి, తిండి తిప్పలు లేకుండా చేసి హింసించాడో భర్త.
బాధితురాలు చెప్పిన వివరాల మేరకు.. దంపతుల మధ్య చిన్న గొడవ జరిగింది. ఎదురు మాట్లాడినందుకు భార్యను కొట్టి, ఇంట్లో పడేసి.. బయట నుంచి తాళం వేసుకుని వెళ్లిపోయాడు ఆ భర్త. ఓ రోజు గడిచిపోయినా తిరిగి రాలేదు. ఓ వైపు ఆకలి, దాహంతో ఇబ్బంది పడుతూ, ఇక భర్త రాడేమోననే భయంతో సాయం కోసం కేకలు పెట్టింది మహిళ.