తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​లకు ఉమ్మడి హైకోర్టు - JAMMU KASHMIR

ఆర్టికల్​ 370ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం... జమ్ముకశ్మీర్​ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన సంగతి తెలిసిందే. తాజాగా జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​లకు ఉమ్మడి హైకోర్టు ఉంటుందని జుడీషియల్​ అకాడమీ డైరెక్టర్​ రాజీవ్​ గుప్తా తెలిపారు.

జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​లకు ఉమ్మడి హైకోర్టు

By

Published : Sep 9, 2019, 5:10 AM IST

Updated : Sep 29, 2019, 10:56 PM IST

జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​లకు ఉమ్మడి హైకోర్టు ఉండనుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర జుడీషియల్​ అకాడెమీ డైరెక్టర్​ రాజీవ్​ గుప్తా వెల్లడించారు. రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో.. కేంద్రానికి చెందిన 108 చట్టాలు, 166 రాష్ట్ర చట్టాలు వర్తిస్తాయన్నారు. మరోవైపు 164 రాష్ట్ర చట్టాలు రద్దుకానున్నట్టు స్పష్టం చేశారు.

ఆగస్టు 5న జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్​ 370ని రద్దు చేసింది కేంద్రం. దీనితో పాటు రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది.

జమ్ముకశ్మీర్​లో అసెంబ్లీ ఉంటుందని.. శాసనసభ లేకుండానే లద్దాఖ్​ కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగుతుందని గుప్తా తెలిపారు.

ఇదీ చూడండి:-'తలపై తుపాకీ పెట్టి మాట్లాడమంటే ఎలా?'

Last Updated : Sep 29, 2019, 10:56 PM IST

ABOUT THE AUTHOR

...view details