జాతీయ పౌర జాబితా(ఎన్ఆర్సీ)పై.. అమెరికాకు చెందిన యూఎస్సీఐఆర్ఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్ఆర్సీ వల్ల అసోంలో ఎప్పటి నుంచో జీవిస్తున్న 19 లక్షలమంది స్వస్థలం కోల్పోతుండటం సరికాదని వ్యాఖ్యానించింది. ఎన్ఆర్సీ ప్రక్రియ పారదర్శకంగా జరగలేదని తెలిపింది.
జాతీయ పౌర జాబితాలో మత స్వేచ్ఛకు ఉన్న చిక్కులపై ప్రస్తావించిందీ సంస్థ. 19 లక్షల మంది పేర్లు ఈ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయాయని.. ముస్లిం జనాభాను తప్పించేందుకు ఈ ప్రక్రియ ఉపకరించడంపై ఆందోళన వ్యక్తం చేసింది.
"19 లక్షల మంది అసోం వాసులు త్వరలో స్వస్థలాన్ని కోల్పోతారు. ఎన్ఆర్సీ.. న్యాయబద్ధంగా, పారదర్శకంగా, సరైన ప్రక్రియలో జరగనందున వారు తమ పౌరసత్వాన్ని కోల్పోయారు. మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. అసోంలోని ముస్లింలను బయటకు పంపించే ఉద్దేశంగానే భారత రాజకీయ నేతల వ్యాఖ్యలు ఉండటం ఆందోళన కలిగించే అంశం. ముస్లింలే లక్ష్యంగా ఈ జాబితాను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు."
-అనురిమా భార్గవ, యూఎస్సీఐఆర్ఎఫ్ కమిషనర్