తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బూతు బొమ్మల కట్టడికి భారత్​కు అమెరికా సాయం - భారత్​

అంతర్జాలంలో బూతు బొమ్మల(పోర్నోగ్రఫి)ను కట్టడి చేసేందుకు భారత్​కు అమెరికా సాయం చేయనుంది. ఈ మేరకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఆన్​లైన్​లో పిల్లల అశ్లీల దృశ్యాలు, లైంగిక దోపిడి సమాచారంపై టిప్​లైన్​ నివేదికను అందించటంలో సాయం చేయనుంది అగ్రరాజ్యం.

బూతు బొమ్మల కట్టడికి భారత్​కు అమెరికా సాయం

By

Published : May 29, 2019, 7:29 PM IST

అంతర్జాలంలో నానాటికీ పెరిగిపోతున్న అశ్లీల దృశ్యాలను(పోర్నోగ్రఫి)ను కట్టడి చేసేందుకు భారత్​ చర్యలు చేపట్టింది. ఆన్​లైన్​లో​ పిల్లల అశ్లీల దృశ్యాలు, లైంగిక దోపిడి సమాచారాన్ని తనిఖీ చేసేందుకు అగ్రరాజ్యం అమెరికా సాయం తీసుకోనుంది. ఈ మేరకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరిందని అధికారులు తెలిపారు.

భారతకు చెందిన జాతీయ నేర గణాంకాల బ్యూరో (నేషనల్​ క్రైమ్​ రికార్డ్స్​ బ్యూరో), దోపిడికి గురైన, తప్పిపోయిన చిన్నారుల కోసం అమెరికా ఏర్పాటు చేసిన జాతీయ కేంద్రం (నేషనల్​ సెంటర్​ ఫర్​ మిస్సింగ్​ అండ్​ ఎక్స్​ప్లాయిటేడ్​ చిల్డ్రన్స్​ )ల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.

ఈ ఒప్పందం మేరకు ఆన్​లైన్​లో చిన్నారుల అశ్లీల దృశ్యాలు, లైంగిక దోపిడిపైభారత్​కు టిప్​లైన్​ నివేదికను ఎన్​సీఎం​ఈసీ అందించనున్నట్లు హోంశాఖ అధికారులు తెలిపారు. ఎన్​సీఎం​ఈసీ వద్ద ఉన్న సుమారు లక్షకు పైగా టిప్​లైన్​ నివేదికలను పొందే అవకాశం లభించనుంది.

ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం... అంతర్జాలంలో అశ్లీలతపై సమాచారం పంచుకోవటానికి, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వినూత్న యంత్రాంగం ఏర్పాటుకు దారి తీసింది. అంతర్జాలం నుంచి అశ్లీల దృశ్యాలను తొలగించేందుకు సంబంధిత విభాగానికి అవకాశం లభించిందని అధికారులు తెలిపారు.

టిప్​లైన్​ రిపోర్ట్​ అంటే..

ప్రత్యేకమైన ఫోన్ నంబర్​​ లేక వెబ్​సైట్​ ద్వారా నేర సమాచారంపై సంబంధిత విభాగానికి ఎవరైనా టిప్​ (ఫిర్యాదు) అందిస్తే... చర్యలు చేపట్టేందుకు వీలైన నివేదికగా అది మారుతుంది. దానినే 'టిప్​లైన్​ రిపోర్ట్​' అంటారు.

ఫోన్​ చేసిన వారి వివరాలను సంబంధిత అధికారులు గోప్యంగా ఉంచుతారు. టిప్​ అందించిన వ్యక్తికి ప్రత్యేక కోడ్​ నంబర్​ ఇస్తారు. దాని ద్వారానే ఆ వ్యక్తిని గుర్తిస్తారు. ఈ నంబర్​ ద్వారా ఫిర్యాదుదారు టిప్ స్థితిని తెలుసుకోవచ్చు.

ఫిర్యాదుల కోసం పోర్టల్​

చిన్నారుల అశ్లీలత, లైంగిక దోపిడి, అంతర్జాల లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు గత ఏడాది ఓ ప్రత్యేక పోర్టల్​ (సైబర్​క్రైమ్​.జీవోవీ.ఇన్​)ను ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. దాని ద్వారా స్వయంచాలితంగా ఎఫ్​ఐఆర్​ నమోదు, నిందితులపై చర్యలు చేపట్టే వీలు కల్పించింది.

ఇదీ చూడండి:జనాభా నియంత్రణపై కేంద్రానికి కోర్టు నోటీసులు

ABOUT THE AUTHOR

...view details