తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కశ్మీర్​లో సాధారణ పరిస్థితుల కోసం ప్రణాళికలేమిటీ?' - trump govt on india issues

జమ్ముకశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలని భారత్​ను కోరింది అమెరికా. ఈ మేరకు దక్షిణ, మధ్య ఆసియా దేశాల సహాయమంత్రి అలిస్. జి. వెల్స్ ప్రకటన విడుదల చేశారు. నిర్బంధంలో ఉన్న రాజకీయ నేతలను విడుదల చేయాలని వ్యాఖ్యానించారు.

కశ్మీర్​పై భారత్​కు అమెరికా సూచన

By

Published : Oct 25, 2019, 10:06 AM IST

జమ్ముకశ్మీర్​ రాజకీయ, ఆర్థిక రంగాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలని భారత్​ను కోరింది అగ్రరాజ్యం అమెరికా. అదే సమయంలో తమ భూభాగంలో ఆశ్రయం పొందుతున్న ఉగ్రవాదులపై కఠిన చర్యలు చేపట్టాలని దాయాది పాకిస్తాన్‌కు సూచించింది.

ఆర్టికల్ 370 రద్దు అనంతరం పెద్దసంఖ్యలో వేర్పాటువాద నేతలను ముందస్తుగా నిర్బంధించిన నేపథ్యంలో కశ్మీర్‌లో సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు ప్రణాళిక అవసరమని అమెరికా దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల సహాయ మంత్రి అలిస్‌. జి. వెల్స్‌ అన్నారు.

"నిర్బంధంలో ఉన్న నేతలను విడుదల చేసేందుకు, రోజువారీ సేవలను పునరుద్ధరించేందుకు, ముఖ్యంగా రాజకీయ, ఆర్థిక రంగాల్లో సాధారణ పరిస్థితులు కల్పించేందుకు మేం మా ఒత్తిడిని కొనసాగిస్తున్నాం."

-అలిస్. జి. వెల్స్, దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల సహాయమంత్రి, అమెరికా

జమ్ముకశ్మీర్​కు చెందిన ఉన్నతస్థాయి నేతలైన ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలు నిర్బంధంలోనే కొనసాగుతున్నారు. 80 లక్షల మంది స్ధానికులు ఇబ్బందులు పడుతున్న తీరు తమకు ఆందోళన కలిగిస్తోందని వెల్స్ వ్యాఖ్యానించారు.భద్రతాపరమైన కారణాలతో కశ్మీర్‌లో జర్నలిస్టులు పలు సవాళ్లు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు.

ఇదీ చూడండి: పడిలేచిన 'మహా' కెరటం పవార్‌!

ABOUT THE AUTHOR

...view details