రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం అహ్మదాబాద్ చేరుకోనున్నారు. తొలి రోజు అహ్మదాబాద్‌లో భారీ రోడ్ షో, నమస్తే ట్రంప్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తరువాతి రోజు ట్రంప్ షెడ్యూల్ మొత్తం దిల్లీలో ఉండనుంది.
నమస్తే ట్రంప్: అధ్యక్షుడి పూర్తి షెడ్యూల్ ఇదే - ట్రంప్ భారత్ విజిట్ 2020
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత పర్యటన కోసం సోమవారం రానున్నారు. ట్రంప్ ఏ సమయానికి చేరుకుంటారు? ఏ ప్రాంతాలకు వెళ్లనున్నారు సహా మరిన్ని విశేషాలు చూద్దాం.
నమస్తే ట్రంప్: అధ్యక్షుడి పూర్తి షెడ్యూల్ ఇదే
ఫిబ్రవరి 24 షెడ్యూల్...
- డొనాల్డ్ ట్రంప్ సోమవారం మధ్యాహ్నం 11.55 నిమిషాలకు గుజరాత్ అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు.
- మధ్యాహ్నం 12.15 నిమిషాలకు విమానాశ్రయం నుంచి మోటేరా స్టేడియం వరకు 22 కి.మీ భారీ రోడ్ షోలో ప్రధాని నరేంద్ర మోదీ, ట్రంప్ పాల్గొంటారు. అధ్యక్షుడికి ఘన స్వాగతం పలికేందుకు వచ్చే వారితో నగరవీధులన్నీ కిక్కిరిసిపోనున్నాయి.
- రోడ్ షో లో భాగంగా మోదీ, ట్రంప్ సబర్మతి ఆశ్రమానికి వెళ్తారు. అధ్యక్షుడికి ఓ రాట్నం, గాంధీ రాసిన రెండు పుస్తకాలను బహుమానంగా మోదీ ఇస్తారు. 30 నిమిషాల పాటు వారు ఆశ్రమంలో ఉండే అవకాశం ఉంది.
- రోడ్ షో పూర్తయిన వెంటనే ఇరువురు నేతలు కలసి ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం మోటేరాకు 12.45 నిమిషాలకు చేరుకుంటారు. అక్కడ జరిగే నమస్తే ట్రంప్ కార్యక్రమంలో లక్ష మందికి పైగా పాల్గొనే అవకాశం ఉంది.
- తర్వాత అమెరికా అధ్యక్షుడు సతీమణి మెలానియా ట్రంప్‌తో కలసి ఆగ్రాకు పయనమవుతారు. సూర్యాస్తమయం లోపు వారు తాజ్మాహల్ను సందర్శించి దిల్లీకి బయల్దేరతారు.
ఫిబ్రవరి 25 షెడ్యూల్...
- ఫిబ్రవరి 25 ఉదయం అధ్యక్షుడు ట్రంప్ సతీసమేతంగా రాష్ట్రపతి భవన్లో జరిగే స్వాగత కార్యక్రమంలో పాల్గొంటారు.
- అనంతరం రాజ్‌ఘాట్‌లోని మహాత్మా గాంధీ సమాధికి వెళ్లి నివాళులర్పిస్తారు.
- తర్వాత హైదరాబాద్ హౌస్‌లో ట్రంప్, మోదీ మధ్య ఉన్నతస్థాయి సమావేశం జరుగుతుంది. అమెరికా అధ్యక్షుడికి ప్రధాని మోదీ విందు ఇస్తారు.
- అనంతరం ట్రంప్ అమెరికా రాయబారి కార్యాలయానికి వెళ్లి దిగ్గజ వ్యాపారవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశం సహా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
- సాయంత్రం రాష్ట్రపతి భవన్‌కు చేరుకుని రామ్‌నాథ్ కోవింద్ ఇచ్చే విందుకు హాజరవుతారు ట్రంప్. తర్వాత అమెరికాకు తిరుగు పయనమవుతారు.
- ఇదీ చూడండి:'ట్రంప్ రాకపై అనుమానం... అయినా సర్వం సిద్ధం'
Last Updated : Mar 2, 2020, 7:32 AM IST