తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అమెరికా అధ్యక్షుడి నేటి బిజీ షెడ్యూల్​ ఇదే

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్​ల తొలి భారత పర్యటన తొలిరోజు విజయవంతంగా సాగింది. మొదటి రోజు పలు కార్యక్రమాల్లో పాల్గొన్న డొనాల్డ్​ ట్రంప్​.. ఇవాళ ఏమేం చేయనున్నారో తెలుసా.. ట్రంప్​ నేడు దిల్లీలో పర్యటించనున్నారు. ఇరు దేశాల మధ్య ఒప్పందాలపై చర్చలు జరగనున్నాయి. రాత్రి 7.30 గంటలకు రాష్ట్రపతితో భేటీ అవుతారు. 10 గంటలకు అమెరికాకు బయల్దేరనున్నారు.

US PRESIDENT DONALD TRUMP SHEDULE FOR TODAY IN INDIA
అమెరికా అధ్యక్షుడి నేటి షెడ్యూల్​ ఇదే

By

Published : Feb 25, 2020, 6:06 AM IST

Updated : Mar 2, 2020, 11:55 AM IST

ఎటూ చూసినా ట్రంప్​-మోదీ చిత్రాలు, భారీ కటౌట్​లు, బ్యాండ్​ బాజాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, లక్షలాది జనం.. ఇలా అహ్మదాబాద్​ విమానాశ్రయంలో మొదలు తాజ్​ పర్యటన వరకు ట్రంప్​ తొలిరోజు పర్యటనలో విశేషాలెన్నో జరిగాయి.

తాజ్ సందర్శన తర్వాత ట్రంప్​ దిల్లీ చేరుకున్నారు. రాత్రి అక్కడే ఐటీసీ మౌర్య హోటల్లో బస చేసిన డొనాల్డ్​ ఇవాళా పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ భారత పర్యటనలో భాగంగా నేటి షెడ్యూల్​ పూర్తిగా దిల్లీలో ఉండనుంది. ట్రంప్​ ఏ సమయానికి ఎక్కడకు వెళతారు సహా పూర్తి షెడ్యూల్​ను విదేశాంగ శాఖ ప్రకటించింది.

ట్రంప్​ షెడ్యూల్​

తొలుత రాష్ట్రపతి భవన్​లో ట్రంప్ దంపతుల​కు అధికారిక స్వాగత కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు. తర్వాత రాజ్​ఘాట్​లోని​ మహాత్మగాంధీ సమాధి వద్ద నివాళులర్పిస్తారు. మోదీతో ద్వైపాక్షిక చర్చల అనంతరం.. అమెరికా ఎంబసీ అధికారులతో సమావేశం కానున్నారు. ఇదే సమయంలో పలువురు వ్యాపారవేత్తలతో చర్చలు జరిపే అవకాశముంది. పలు కార్యక్రమాల అనంతరం రాత్రి 10 గంటలకు స్వదేశానికి బయల్దేరనున్నారు. ఇంతటితో తొలిసారి భారత్​లో పర్యటించిన ట్రంప్​ షెడ్యూల్​ ముగియనుంది.

Last Updated : Mar 2, 2020, 11:55 AM IST

ABOUT THE AUTHOR

...view details