అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియాకు దిల్లీలోని రాజ్‌భవన్‌లో ఘన స్వాగతం లభించింది. ట్రంప్ దంపతులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారిక లాంఛనాలతో సాదర స్వాగతం పలికారు. భారత త్రివిధ దళాల గౌరవ వందనాన్ని అమెరికా అధ్యక్షుడు స్వీకరించారు.
రాష్ట్రపతి భవన్లో ట్రంప్‌కు ఘన స్వాగతం - ట్రంప్ విజిట్ ఢిల్లీ
భారత్‌లో రెండో రోజు పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ట్రంప్ దంపతులకు ఘన స్వాగతం పలికారు.
రాష్ట్రపతి భవన్లో ట్రంప్ దంపతులకు ఘన స్వాగతం
ఈ కార్యక్రమానికి ట్రంప్ కుమార్తె ఇవాంకా, అల్లుడు కుష్మర్ కూడా హాజరయ్యారు. భారత్ తరఫున పలువురు కేంద్రమంత్రులు పాల్గొన్నారు.
అనంతరం రాజ్‌ఘాట్‌కు బయలుదేరారు ట్రంప్ దంపతులు. మహాత్మ గాంధీ సమాధి వద్ద నివాళులర్పిస్తారు. ఆ తర్వాత దిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీతో అవుతారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య పలు ఒప్పందాలపై అగ్రనేతలిద్దరూ సంతకాలు చేసే అవకాశముంది.
Last Updated : Mar 2, 2020, 12:18 PM IST