తెలంగాణ

telangana

నమస్తే ట్రంప్​: మోదీకి 'ప్రోగ్రెస్​ రిపోర్ట్​' ఇచ్చిన డొనాల్డ్

By

Published : Feb 24, 2020, 2:38 PM IST

Updated : Mar 2, 2020, 9:47 AM IST

నమస్తే ట్రంప్​ కార్యక్రమంలో ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. ఒక ఛాయ్​వాలాగా జీవితం మొదలు పెట్టి ఈ స్థాయికి చేరుకున్నారని.. భారత్​ను ఒక అద్భుత శక్తిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని కొనియాడారు.

trump about modi
ప్రధాని మోదీ పాలనపై అధ్యక్షుడి ప్రశంసలు

నమస్తే ట్రంప్​: మోదీకి 'ప్రోగ్రెస్​ రిపోర్ట్​' ఇచ్చిన డొనాల్డ్

నమస్తే ట్రంప్​ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. నమస్తే.. అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన ట్రంప్​.. ప్రధాని తన నిజమైన స్నేహితుడుని పేర్కొన్నారు. మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అద్భుత విజేతగా దేశాభివృద్ధి కోసం మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు.

మోదీ నేతృత్వంలో భారత్​ అద్భుతంగా అభివృద్ధి చెందుతోందని కొనియాడారు ట్రంప్​.

" ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంలో మొదటి సారి దేశంలోని ప్రతి గ్రామానికి విద్యుత్తు సరఫరా అందుతోంది. 320 మిలయన్లకుపైగా భారతీయులు ప్రస్తుతం అంతర్జాలం పొందుతున్నారు. 70 మిలయన్లకుపైగా ప్రజలు వంట గ్యాసును పొందగలుగుతున్నారు. 600 మిలియన్లకుపైగా ప్రజలు కనీస పారిశుద్ధ్య సౌకర్యాలను పొందారు. రోజుకు 12 మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడుతున్నారు."

- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు.

Last Updated : Mar 2, 2020, 9:47 AM IST

ABOUT THE AUTHOR

...view details