భారత పర్యటనలో భాగంగా గుజరాత్ అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా. గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
'గాంధీ' రాట్నం ఎలా తిప్పాలి?... తెలుసుకునేందుకు ట్రంప్ ఆసక్తి - trump visit india 2020
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆశ్రమంలో రాట్నాన్ని తిప్పుతూ దాని విశేషాలు అడిగి తెలుసుకున్నారు.
!['గాంధీ' రాట్నం ఎలా తిప్పాలి?... తెలుసుకునేందుకు ట్రంప్ ఆసక్తి US President Donald Trump](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6184037-297-6184037-1582529262566.jpg)
సబర్మతి ఆశ్రమంలో రాట్నం తిప్పిన ట్రంప్ దంపతులు
సబర్మతి ఆశ్రమంలో రాట్నం తిప్పిన ట్రంప్ దంపతులు
గాంధీ తన జీవితంలో ఒక భాగంగా ఉన్న చరఖా విశేషాలను, దాని ప్రాధాన్యాన్ని ప్రధాని మోదీని అడిగి తెలుసుకున్నారు ట్రంప్ దంపతులు. దానిని తిప్పుతూ కాసేపు అక్కడే గడిపారు. ఈ సందర్భంగా మహాత్ముడి ఆశ్రమంలోని పలు విషయాలను ట్రంప్‌కు వివరించారు మోదీ. "చెడు వినకు- చెడు చూడకు- చెడు మాట్లాడకు" అని సందేశమిచ్చే 3 కోతుల ప్రతిమను ట్రంప్‌కు బహూకరించారు మోదీ.
సందర్శకుల పుస్తకంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు చెబుతూ తమ సందేశం రాశారు ట్రంప్ దంపతులు. అద్భుతమైన పర్యటనగా కొనియాడారు.
Last Updated : Mar 2, 2020, 9:35 AM IST