మహాత్ముడి స్మరణలో ట్రంప్.. రాజ్‌ఘాట్‌లో నివాళి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. సతీమణి మెలానియాతో కలిసి బాపూను స్మరించుకున్నారు ట్రంప్.
అనంతరం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యేందుకు హైదరాబాద్ హౌస్‌కు బయలుదేరారు. అక్కడే దాదాపు గంటకుపైగా ప్రధానితో పలు ఒప్పందాలపై చర్చించి ఇరువురు నేతలు సంతకాలు చేసే అవకాశముంది.
అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియాకు దిల్లీలోని రాజ్‌భవన్‌లో ఘన స్వాగతం లభించింది. ట్రంప్ దంపతులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారిక లాంఛనాలతో స్వాగతం పలికారు. భారత త్రివిధ దళాల గౌరవ వందనాన్ని అమెరికా అధ్యక్షుడు స్వీకరించారు.
ఇదీ చూడండి:-అమెరికా అధ్యక్షుడి పేరుతో భారత్‌లో ఓ గ్రామం!