తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'3 బిలియన్​ డాలర్ల రక్షణ ఒప్పందాలపై రేపు సంతకం' - trump visit to ahmedabad 2020

అమెరికా-భారత్​ మధ్య రక్షణ రంగ సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. ప్రపంచంలోనే అత్యాధునిక మిలిటరీ సామగ్రిని భారత్​కు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సుమారు 3 బిలియన్​ డాలర్ల ఒప్పందంపై రేపు సంతకం చేస్తానని ప్రకటించారు.

US President
అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్

By

Published : Feb 24, 2020, 3:45 PM IST

Updated : Mar 2, 2020, 9:55 AM IST

'3 బిలియన్​ డాలర్ల రక్షణ ఒప్పందాలపై రేపు సంతకం'

భారత్​తో రక్షణ రంగంలో సుమారు 3 బిలియన్​ డాలర్ల ఒప్పందంపై రేపు సంతకం చేస్తున్నట్లు ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. మోటేరా స్టేడియంలో నిర్వహించిన నమస్తే ట్రంప్​ కార్యక్రమం వేదికపై ఇరుదేశాల రక్షణ రంగ భాగస్వామ్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు అగ్రరాజ్య అధ్యక్షుడు. ప్రపంచంలోనే అత్యాధునిక ఆయుధ సామగ్రిని అమెరికా తయారు చేస్తోందని.. వాటిని భారత్​కు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

"అమెరికా, భారతీయ రక్షణ సంస్థలు తొలిసారి నిర్వహించిన సైనిక దళాల ప్రదర్శన.. ఇరుదేశాల మధ్య ఉన్న కీలక భాగస్వామ్యంలో గొప్ప ముందడుగు. ఆ సంయుక్త విన్యాసాల పేరు 'టైగర్​ ట్రయంఫ్'. మన మధ్య ఉన్న రక్షణ రంగ సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు.. ప్రపంచంలోనే అత్యాధునిక మిలిటరీ సామగ్రిని భారత్​కు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. మేము గొప్ప ఆయుధాలు తయారు చేస్తున్నాం. అందులో విమానాలు, క్షిపణులు, రాకెట్లు, నౌకలు ఉన్నాయి. ఇప్పుడు భారత్​తో ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నాం. ఈ ఒప్పందంలో అత్యాధునిక ఎయిర్​ డిఫెన్స్​ సిస్టమ్స్​, ఆయుధాలు కలిగిన, సాధారణ విహంగాలు ఉన్నాయి. భారతీయ రక్షణ విభాగానికి సుమారు 3 బిలియన్​ డాలర్ల విలువైన హెలికాఫ్టర్లు, ఇతర యుద్ధ సామగ్రిని అందించే ఒప్పందంపై రేపు నేను సంతకం చేయబోతున్నా."

- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

Last Updated : Mar 2, 2020, 9:55 AM IST

ABOUT THE AUTHOR

...view details