తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​కు అమెరికా 'ఎఫ్-18' యుద్ధ విమానాలు

భారత నావికాదశ అవసరాలను తీర్చేందుకు ఎఫ్-18 యుద్ధవిమానాలను అమెరికా విక్రయించనుందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఇటీవల జరిగిన 'టూ ప్లస్​ టూ' భేటీలో భారత్​ ప్రతిపాదనకు అగ్రరాజ్యం అంగీకారం తెలిపినట్లు పేర్కొన్నాయి.

US offers F-18 fighters to India for Naval requirement
భారత్​కు అమెరికా ఎఫ్-18 నావికా యుద్ధ విమానాలు

By

Published : Oct 28, 2020, 3:31 PM IST

భారత్​తో సన్నిహిత సంబంధాలు మరింత మెరుగుపరుచుకోవాలని భావిస్తోంది అగ్రరాజ్యం అమెరికా. నావికాదళ అవరాలను తీర్చే విధంగా అధునాతన ఎఫ్​-18 నావికా యుద్ధవిమానాలను భారత్​కు విక్రయించేందుకు సిద్ధమైంది.

ఐఎన్ఎస్ విక్రమాదిత్య, నిర్మాణంలో ఉన్న స్వదేశీ విమాన వాహక నౌక సహా మొత్తం 57 నావికాదళ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు భారత నావికాదళం కొన్ని సంవత్సరాలుగా ఎదురుచూస్తోంది.

భారత ప్రభుత్వ ప్రతిపాదన మేరకు ఇటీవల జరిగిన 'టూ ప్లస్ టూ' భేటీలో ఎఫ్​-18 యుద్ధవిమానాలను విక్రయించేందుకు అమెరికా సుముఖత వ్యక్తం చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దిల్లీలో జరిగిన ఈ సమావేశంలో ఇరు దేశాల రక్షణ శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు.

భారత నావికాదళం ప్రస్తుతం వినియోగిస్తున్న యుద్ధవిమానాలను ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది మొదట్లో తొలగించనున్నారు. అందుకే భవిష్యత్​ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఫ్రాన్స్​ నుంచి రఫేల్ నావికాదళ యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది భారత్. ఇప్పుడు అమెరికా నుంచి ఎఫ్-18 ఫైటర్ జెట్లను కొనుగోలు చేయనుంది.

ఎఫ్​-18 ఫైటర్స్​తో పాటు మానవరహిత సీ గార్డ్​ యుద్ధ విమానాన్ని కూడా భారత్​కు విక్రయించేందుకు అమెరికా సిద్ధమైంది.

ABOUT THE AUTHOR

...view details