కరోనాపై పోరులో భాగంగా అమెరికా.. భారత్‌కు మరో 100 వెంటిలేటర్లను విరాళంగా పంపింది. దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు సాయమందిస్తున్నట్లు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అధునాతన సౌకర్యాలతో తమ దేశంలో తయారైన ఈ వెంటిలేటర్ల ద్వారా కరోనా రోగులకు మరింత నాణ్యమైన చికిత్సను అందించవచ్చని యూఎస్ రాయబార కార్యాలయం వెల్లడించింది.
రెడ్‌క్రాస్ సమన్వయంతో..
ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సమన్వయంతో.. యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్(యూఎస్ఏఐడీ) ద్వారా ఈ వెంటిలేటర్లను భారత్‌కు పంపింది అమెరికా ప్రభుత్వం. వెంటిలేటర్లతో పాటు వాటి ఆపరేటింగ్‌కు సంబంధించిన ప్యాకేజీ ట్యూబ్‌లు, ఫిల్టర్లు, ఇతర సామగ్రికి అవసరమైన నిధులు సమకూరుస్తున్నట్లు తెలిపింది.
మొత్తం 200 వెంటిలేటర్లను విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించిన అగ్రరాజ్యం.. తొలిదశలో భాగంగా 100 వెంటిలేటర్లను జూన్ 14న భారత్‌కు పంపింది.
ఇదీ చదవండి:హైజాక్ కథ సుఖాంతం- ప్రయాణికులందరూ సేఫ్