తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దత్తత తీసుకున్నారు.. హోటల్​లోనే చిక్కుకుపోయారు!

కరోనాతో యావత్ ప్రపంచం స్తంభించిపోయింది. భారత్​లో చిన్నారిని దత్తత తీసుకున్న అమెరికా జంట.. కరోనా లాక్​డౌన్​ కారణంగా హోటల్​ గదులకే పరిమితమైంది. దత్త పుత్రికను తమ ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సాయం చేయాలని విజ్ఞప్తి చేస్తోంది.

US couple, adopted daughter, trapped in India coronavirus lockdown
దత్తత తీసుకున్నారు.. హోటల్​లోనే చిక్కుకుపోయారు!

By

Published : Mar 27, 2020, 3:33 PM IST

కరోనా నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ కొనసాగుతోంది. అయితే, ఈ లాక్​డౌన్​ అమెరికా దంపతలకు చిక్కులు తెచ్చిపెట్టింది. ఓ చిన్నారిని దత్తత తీసుకునేందుకు భారత్​కు వచ్చిన మైక్​, విట్నీ సవిల్లే... తిరిగి ఇంటికెళ్లే దారి లేక దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

దత్తత తీసుకున్నారు.. హోటల్​లోనే చిక్కుకుపోయారు!

జార్జియాకు చెందిన మైక్​, విట్నీ కాలేజీలోనే ప్రేమలో పడ్డారు. ఎప్పటికైనా ఓ అనాథను దత్తత తీసుకుని, మంచి జీవితాన్నివ్వాలనేది వారిద్దరి కల. పెళ్లై, ఇద్దరు పిల్లలు పుట్టాక వారి కలను సాకారం చేసుకునేందుకు భారత్​కు వచ్చారు. ఓ బాలికను దత్తత తీసుకుని గ్రేస్​ అని నామకరణం చేశారు. కానీ, కరోనా వారికి అడ్డంకైంది.

వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు భారతప్రభుత్వం అంతర్జాతీయ విమానాల రాకపోకలు నిలిపివేయగా.. కొత్త కుమార్తెతో కలిసి హోటల్​ గదిలోనే కాలం వెళ్లదీస్తున్నారు మైక్​, విట్నీ. తమ బాధను అర్థం చేసుకుని వీలైనంత త్వరగా తమను ఇంటికి చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు.

"మేము మార్చ్​ 5న జార్జియా నుంచి బయలుదేరాము. మార్చ్​ 6న ఇక్కడికి చేరుకున్నాము. కొన్ని రోజుల తరువాత మేము మా కుమార్తెను పూర్తిగా మా ఇంటికి తీసుకెళ్తాం. ఇక్కడ కొన్ని దత్తత ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉంది. ఇంకా, గ్రేస్​ పేరిట పాస్​పోర్ట్​, వీసా రావాలి. కానీ, కరోనా వైరస్​ వల్ల ప్రపంచవ్యాప్తంగా పెను మార్పులు జరిగాయి. లాక్​డౌన్​ కారణంగా మా కుమార్తె భారత్​లోనే ఉండిపోవాల్సి వచ్చింది. గ్రేస్​తో మేమూ ఉన్నాము కాబట్టి సంతోషంగానే ఉంది. కానీ, పరిస్థితులు కాస్త మారితే ఇంకా బాగుంటుంది. మమ్మల్ని మా ఇంటికి చేర్చడానికి ఎవరైనా ముందుకు రావాలని కోరుతున్నా."

-విట్నీ సవిల్లే

మైక్​, విట్నీలతో పాటు, అదే హోటల్​లో చిక్కుకున్న మరో రెండు కుటుంబాలను స్వదేశాలకు చేర్చేందుకు అమెరికా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం దిల్లీలోని దౌత్య కార్యాలయంతో కలిసి పని చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు జార్జియా సెనెటర్​ డేవిడ్​ పెర్డ్యూ.

ఇదీ చదవండి:లాక్​డౌన్​ ఉపశమనం కోసం 'రామాయణం' రీటెలికాస్ట్

ABOUT THE AUTHOR

...view details