తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​కు 'రోమియో'లు- అమెరికా ఆమోదం - సీ-కింగ్​ హెలికాప్టర్​

అత్యంత శక్తిమంతమైన 24 బహుళార్థక ఎమ్​హెచ్​-60 'రోమియో' సీహాక్​ హెలికాఫ్టర్లు భారత్​కు కొనుగోలు చేసేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం విలువ రూ.16,320 కోట్ల పైమాటే.

బహుళార్థక ఎమ్​హెచ్​-60 'రోమియో' సీహాక్​ హెలికాఫ్టర్

By

Published : Apr 3, 2019, 1:20 PM IST

బహుళార్థక ఎమ్​హెచ్​-60 'రోమియో' సీహాక్​ హెలికాఫ్టర్

భారత సైన్యం మరింత బలోపేతం కానుంది. 24 బహుళార్థక ఎమ్​హెచ్​-60 'రోమియో' సీహాక్​ హెలికాప్టర్లను భారత్​కు అందజేయడానికి అమెరికా ఆమోదముద్ర వేసింది. ఈ ఒప్పందం విలువ సుమారుగా 2.4 బిలియన్​ డాలర్లు(రూ.16,320 కోట్లు) అని అమెరికా ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఒప్పందానికి అనుమతిచ్చినట్లు ట్రంప్​ ప్రభుత్వం అమెరికన్​ కాంగ్రెస్​కు తెలిపింది.

ఈ సబ్​మెరైన్ ప్రతిరోధక​ హంటర్​ హెలికాఫ్టర్లను సమకూర్చుకోవాలని గత దశాబ్దకాలంగా ప్రయత్నిస్తోంది భారత్. జలాంతర్గాములు, నౌకలపై దాడికి, సముద్ర జలాల్లో గాలింపు, సహాయక చర్యలకు బ్రిటీష్ తయారీ సీ-కింగ్​ హెలికాప్టర్​లను వినియోగిస్తోంది భారత సైన్యం. తాజా ఒప్పందంతో వీటి స్థానాన్ని బహుళార్థక ఎమ్​హెచ్​-60 'రోమియో' సీహాక్​ హెలికాప్టర్లు భర్తీ చేయనున్నాయి. ఫలితంగా దేశ రక్షణ వ్యవస్థ మరింత శక్తిమంతం కానుంది.

ఈ అధునాతన హెలికాప్టర్ల ఒప్పందం ద్వారా ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని అమెరికా పేర్కొంది. ఇండో పసిఫిక్​, దక్షిణాసియా ప్రాంతాల్లో రాజకీయ సుస్థిరత, శాంతి సహా ప్రాంతీయ సమస్యల పరిష్కారానికి ఉపకరిస్తుందని అభిప్రాయపడింది.

సాటిలేని మేటి..

ప్రస్తుతం అమెరికా నావికాదళం ఉపయోగిస్తోన్న ఈ బహుళార్థక ఎమ్​హెచ్​-60 'రోమియో' సీహాక్ శ్రేణి, ప్రపంచంలోనే అత్యుత్తమ మారిటైమ్​ హెలికాప్టర్లలో ఒకటిగా పరిగణిస్తున్నారు.
ఈ 'రోమియో' సీహాక్​ హెలికాప్టర్లను యాంటీ-సబ్​మెరైన్​, యాంటీ-సర్ఫేస్​ వార్​ఫేర్, నిఘా, సమాచార వ్యవస్థలు, రక్షణ, సహాయక చర్యలకు, నావికా యుద్ధాల్లో వినియోగించేందుకు అనువైనవి.

చైనా దుందుడుకు వ్యవహారశైలి, హిందూ మహా సముద్ర పరిధిలోని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భారత్​కు ఈ బహుళార్థక ఎమ్​హెచ్​-60 'రోమియో' సీహాక్​ హెలికాప్టర్లు ఎంతో అవసరం.

ABOUT THE AUTHOR

...view details