తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉత్తర ముంబయి నుంచి నటి ఊర్మిళ పోటీ - లోక్​సభ

ఇటీవలే కాంగ్రెస్​ పార్టీలో చేరిన బాలీవుడ్​ తార ఊర్మిళ మాతోండ్కర్​ ఉత్తర ముంబయి నియోజకవర్గం నుంచి లోక్​సభ ఎన్నికల్లో పోటీచేయనున్నారు.

ఊర్మిళ మాతోండ్కర్

By

Published : Mar 29, 2019, 11:13 AM IST

Updated : Mar 29, 2019, 12:42 PM IST

ఉత్తర ముంబయి నుంచి నటి ఊర్మిళ పోటీ

బాలీవుడ్​ నటి ఊర్మిళ మాతోండ్కర్​ లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమైంది. ఉత్తర ముంబయి స్థానం నుంచి కాంగ్రెస్​ అభ్యర్థిగా ఆమె పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ​ ప్రకటన విడుదల చేసింది.

రంగీలా చిత్రంతో అందరికీ సుపరిచితురాలైన ఊర్మిళ... బుధవారం కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ సమక్షంలో పార్టీలో చేరారు.

ఎప్పటి నుంచో ముంబయిలోనే నివసిస్తున్నారు ఊర్మిళ. నగరంలోని ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేస్తారా అని నిన్న ఈటీవీ భారత్​ అడిగిన ప్రశ్నకు సమాధానం దాటవేశారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారికంగా​ ప్రకటన చేసింది.

Last Updated : Mar 29, 2019, 12:42 PM IST

ABOUT THE AUTHOR

...view details