తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ రాష్ట్రంలో వరదల బీభత్సానికి 10మంది మృతి - ఆ రాష్ట్రంలో వరదల బీభత్సం.. ఇప్పటివరకు 10మంది మృతి

బిహార్​లో వరదల కారణంగా ఇప్పటివరకు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 10 జిల్లాల్లో జనజీవనంపై వరదల ప్రభావం పడింది. అత్యవసర సేవలు అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.

bihar floods
ఆ రాష్ట్రంలో వరదల బీభత్సం

By

Published : Jul 25, 2020, 5:56 PM IST

బిహార్​లో వరద బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటివరకు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 10 జిల్లాల్లో వరద సమస్య నెలకొందని ప్రభుత్వం ప్రకటించింది. సీతామార్హి, శివహార్, సుపాల్, కిషన్​గంజ్, దర్భంగా, ముజఫర్‌పూర్, గోపాల్‌గంజ్, తూర్పు చంపారన్, పశ్చిమ చంపారన్ జిల్లాలు వరద జలాల వల్ల తీవ్రంగా దెబ్బతిన్నట్లు వెల్లడించింది.

మొత్తంగా 529 గ్రామపంచాయతీలపై వరద జలాల ప్రభావం పడిందని.. 9,60,831 మంది పౌరుల జనజీవనం అస్తవ్యస్తంగా మారిందని అధికారులు తెలిపారు. 93 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు స్పష్టం చేశారు.

అత్యవసర సేవలు అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్​, ఎస్డీఆర్​ఎఫ్ సిబ్బందిని సిద్ధం చేసినట్లు వెల్లడించింది రాష్ట్ర ప్రభుత్వం. క్షేత్రస్థాయిలో 22 బృందాలను మోహరించామని, కేంద్ర కార్యాలయంలో మరో 5 టీమ్​లు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది.

ఇదీ చూడండి:ఒక్క ఇల్లు కనిపించకుండా నీటమునిగిన ఊరు

ABOUT THE AUTHOR

...view details