సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. దీనిపై వివరణనిస్తూ... పరీక్షను వాయిదా వేయడం సాధ్యం కాదని యూపీఎస్సీ తరపు న్యాయవాది నరేష్ కౌషిక్ న్యాయస్థానానికి తెలిపారు.
సివిల్స్ పరీక్షల నిర్వహణపై విచారణ వాయిదా - సివిల్స్ పరీక్షలు వాయిదాపై సుప్రీం విచారణ
సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయాలని నమోదైన పిటిషన్పై విచారణను బుధవారానికి వాయిదా వేసింది సుప్రీం. పరీక్షలను వాయిదా వేయటం కుదరని యూపీఎస్సీ తెలిపిన నేపథ్యంలో అందుకు గల కారణాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది సర్వోన్నత న్యాయస్థానం.
![సివిల్స్ పరీక్షల నిర్వహణపై విచారణ వాయిదా UPSC Postponement Plea to be taken up on Wednesday - September 30](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8966274-932-8966274-1601276203346.jpg)
సివిల్స్ పరీక్షలపై విచారణ బుధవారానికి వాయిదా
ఈ నేపథ్యంలో వాయిదా వేయకపోవడానికి గల కారణాలతో రేపు అఫిడవిట్ దాఖలు చేయాలని యూపీఎస్సీని ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం. తదుపరి విచారణ బుధవారానికి వాయిదా వేసింది. అక్టోబర్ 4న జరగనున్న సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయాలని 20మంది యూపీఎస్సీ ఆశావహులు పిటిషన్ వేశారు.