తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కిరణ్​ బేడీ ట్వీట్​పై లోక్​సభలో గందరగోళం

పుదుచ్చేరి గవర్నర్​ కిరణ్​ బేడీ చేసిన ట్వీటు లోక్​సభలో దుమారం లేపింది. ట్వీట్​పై అభ్యంతరం వ్యక్తం చేశారు డీఎంకే ఎంపీ టీఆర్​ బాలు. అనంతరం డీఎంకే ఎంపీలందరూ వెల్​లోకి వచ్చి నినాదాలు చేశారు.

ఎంపీ టీఆర్​ బాలు

By

Published : Jul 3, 2019, 6:57 PM IST

17వ లోక్​సభ ఏర్పాటయ్యాక మొదటి సారి సభలో గందరగోళ పరిస్థితి తలెత్తింది. ఇందుకు కారణం పుదుచ్చేరి గవర్నర్​ కిరణ్ బేడీ చేసిన ట్వీట్​పై డీఎంకే ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేయటమే. ట్వీట్​పై ఆగ్రహం వ్యక్తం చేసిన డీఎంకే ఎంపీలు వెల్​లోకి వెళ్లి నిరసన తెలిపారు.

శూన్యగంటలో ప్రశ్నోత్తరాలలో భాగంగా కిరణ్​ బేడీ ట్వీట్​పై అభ్యంతరం వ్యక్తంచేశారు డీఎంకే ఎంపీ టీఆర్​ బాలు. శూన్యగంటలో ఇలాంటి ఫిర్యాదులను స్వీకరించలేమని సభాపతి ఓం బిర్లా స్పష్టం చేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్నవారిపై లిఖితపూర్వక ఫిర్యాదు చేయాలని సభాపతి సూచించారు.

లోక్​సభలో గందరగోళం

అయినప్పటికీ వెనక్కు తగ్గని బాలు.. వెల్​లోకి వెళ్లి నినాదాలు చేశారు. డీఎంకే ఎంపీలందరితో పాటు ఆప్​ ఎంపీ భగవత్​ మాన్ ఆయనను అనుసరించారు. డీఎంకే నేతల నిరసనపై స్పందించిన పార్లమెంట్​ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్​ జోషి.. తీర్మానం పెట్టాల్సిందిగా చెప్పారు. అదే సమయంలో రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ తీర్మానం పెడితే చర్చకు వస్తామని ప్రకటించారు.

సభాపతి చురకలు

శూన్యగంటలో భాగంగా బంగాల్​ తృణమూల్​, భాజపా ఎంపీల మధ్య మాటల యుద్ధం సాగింది. ఎంపీలను శాంత పరిచేందుకు.. "లోక్​సభను బంగాల్​ విధాన సభలా మార్చకండి" అంటూ వ్యంగ్యంగా స్పందించారు సభాపతి.

ఇదీ చూడండి: రాహుల్​ నిష్క్రమణ... కాంగ్రెస్​కు కొత్త అధ్యక్షుడు!

ABOUT THE AUTHOR

...view details