తమిళనాడు వెల్లూర్ జిల్లాలోని వానియంపాడి దగ్గర నారాయణపురంలో ఎస్సీలు ఇప్పటికీ అవమానాలు ఎదురుకుంటున్నారు. గ్రామంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. దహనం చేసేందుకు శ్మశానవాటికకు వెళ్లాలంటే వంతెన దాటాలి, వంతెనకు ఇరువైపులా అగ్రకులాలవారి పొలాలున్నాయి. కానీ అగ్రకులాలవారు ఓ ఎస్సీ శవాన్ని మా పొలాల మీదుగా తీసుకువెళ్లేందుకు వీల్లేదన్నారు.
వారి పొలాలు దాటకుండా శ్మశానానికి వెళ్లేందుకు వేరే మార్గం లేదు. అది తెలిసి కూడా, అగ్రకులాలు ఇలా అడ్డుకోవడం వారి అంహకారానికి అద్దం పట్టింది. వాదోపవాదాల తర్వాత.. మృతదేహాన్ని చాపలో చుట్టి, తాళ్ల సాయంతో20 అడుగుల ఎత్తున్న వంతెన పైనుంచి కిందికి దింపి అంత్యక్రియలు పూర్తి చేశారు.