తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సుదూర లక్ష్యాలు ఛేదించేలా 'బ్రహ్మోస్' శక్తిమంతం

500 కి.మీ సుదూర లక్ష్యాలను ఛేదించగలిగే అప్​గ్రేడెడ్​ బ్రహ్మోస్ క్షిపణిని భారత్ విజయవంతంగా ప్రయోగించిందని బ్రహ్మోస్ ఎయిరోస్పేస్​ సీఈఓ సుధీర్​కుమార్ మిశ్రా తెలిపారు. ఇది ధ్వని కంటే 2.8 రెట్లు వేగంతో ప్రయాణిస్తుందని ఆయన తెలిపారు.

సుదూర లక్ష్యాలు ఛేదించేలా 'బ్రహ్మోస్' శక్తిమంతం

By

Published : Jul 7, 2019, 11:12 PM IST

భారత అమ్ములపొదిలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన... 500కి.మీ పరిధిలోని లక్ష్యాలను ఛేదంచగలిగే బ్రహ్మోస్​ క్షిపణి అప్​గ్రేడెడ్​ వెర్షన్​ సిద్ధంగా ఉందని బ్రహ్మోస్​ ఎయిరోస్పేస్​ సీఈఓ సుధీర్​కుమార్ మిశ్రా తెలిపారు.

ఎలైట్​ మిస్సైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్ (ఎమ్​టీసీఆర్​)లో భారత్​ ఓ భాగంగా ఉంది. అందువల్ల ఈ బ్రహ్మోస్ క్షిపణి పరిధిని పెంచే అవకాశం ఉందని ఓ వార్తా ఛానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిశ్రా పేర్కొన్నారు.

"ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్​సోనిక్​ క్రూయిజ్ క్షిపణి.. బ్రహ్మోస్. 500 కి.మీ పరిధిలోని లక్ష్యాలను కచ్చితంగా ఛేదించగలిగే ఈ క్షిపణిని భారతదేశం విజయవంతంగా పరీక్షించింది. భారత అమ్ములపొదిలో సిద్ధంగా ఉన్న ఈ క్షిపణి.... సంప్రదాయ యుద్ధాలరీతులను పూర్తిగా మార్చివేస్తుంది."- సుధీర్ కుమార్ మిశ్రా, బ్రహ్మోస్ ఎయిరోస్పేస్​ సీఈఓ

ధ్వని కంటే మూడు రెట్లు వేగంగా...

భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్-30 యుద్ధవిమానం నుంచి బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా భారత్ ప్రయోగించింది. ఇది ధ్వని వేగానికి దాదాపు మూడు రెట్లు (2.8 రెట్లు) వేగంగా ప్రయాణిస్తుంది. దీంతో యుద్ధ విమానాల్లో సుదూర లక్ష్యాలను ఛేదించగలిగే క్షిపణులను అనుసంధానించిన ఏకైక దేశంగా భారత్ నిలిచిందని మిశ్రా తెలిపారు.

భారత సైనిక, వైమానిక, నావికా దళాలు కోరుకునే బ్రహ్మోస్ క్షిపణి ప్రథమ స్థానంలో నిలిచిందని మిశ్రా తెలిపారు. బ్రహ్మోస్ ఎయిరోస్పేస్​ అభివృద్ధి చేసిన ఈ సాంకేతికతలు ఇంతకు ముందు భారత్​లో కానీ... రష్యా వద్ద కానీ లేవని ఆయన అన్నారు.

పర్వత ప్రాంతాల్లో జరిగే యుద్ధాల్లో ఇది అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని మాజీ డిప్యూటీ ఆర్మీ చీఫ్​ లెఫ్టినెంట్ జనరల్ సుబ్రాతా సాహా తెలిపారు. ఉదాహరణకు ఈ క్షిపణి కార్గిల్ యుద్ధ సమయంలో భారత్​కు విజయాన్ని చేకూర్చిపెట్టిందనడంలో సందేహం లేదన్నారు.

బ్రహ్మోస్ ఎయిరోస్పేస్ భారత్​, రష్యా ప్రభుత్వాల ఉమ్మడి యాజమాన్యంలోని సంస్థ. అయితే ఈ సంస్థ బ్రహ్మోస్ క్షిపణులను భారత్​లోనే ఉత్పత్తి చేస్తుంది.

ఇదీ చూడండి: కర్​నాటకం: కాంగ్రెస్-జేడీఎస్​ నేతల భేటీ

ABOUT THE AUTHOR

...view details