పశ్చిమ బంగాల్లోని డమ్‌డమ్ కారాగారంలో ఖైదీలు, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో ముగ్గురు ఖైదీలు మరణించారు. మరికొంత మంది గాయపడ్డట్లు సమాచారం.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి 31 వరకు ఖైదీలను కలిసేందుకు కుటుంబ సభ్యులకు అనుమతిని నిరాకరిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన మొదలైనట్లు అధికారులు తెలిపారు. పోలీసులపై రాళ్లు రువ్వుతూ, జైలు ఆస్తులకు ఖైదీలు నిప్పంటించినట్లు జైలు సిబ్బంది పేర్కొన్నారు.
తొలుత కొంతమంది ఖైదీలు తమను పెరోల్ మీద బయటకు పంపాలని కోరినట్లు సీనియర్ అధికారులు తెలిపారు. అందుకు నిరాకరించడం వల్ల ఆందోళన చేపట్టినట్లు చెప్పారు. చివరకు ఈ ఆందోళన పోలీసులు, ఖైదీలకు ఘర్షణలా మారినట్లు వెల్లడించారు.