ఉత్తర్‌ప్రదేశ్ మొరాదాబాద్ జిల్లాలో మూడు రోజుల క్రితం ఓ మహిళ అత్యాచారానికి గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసుల ప్రకారం..
ఉత్తర్‌ప్రదేశ్ మొరాదాబాద్ జిల్లాలో మూడు రోజుల క్రితం ఓ మహిళ అత్యాచారానికి గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసుల ప్రకారం..
ఒంటరిగా ఉన్న బాధితురాలి ఇంట్లోకి పొరుగున ఉన్న అరవింద్ ప్రవేశించి.. తుపాకీతో బెదిరించి ఘాతుకానికి ఒడిగట్టాడు. దీని గురించి ఎవరితోనైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని ఆమెను భయపెట్టాడు. అయితే, జరిగిన విషయాన్ని తన తల్లికి వివరించింది బాధితురాలు.
దీంతో బాధితురాలిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. తప్పు ఒప్పుకున్నాడు.
ఇదీ చూడండి:'చిరుత' దాడికి రేడియం జాకెట్‌తో చెక్!