ఓ వివాహ వేడకలో గాయని సప్నా చౌదరీ పాట వేయలేదని డీజే నిర్వహిస్తున్న వ్యక్తి పై దాడి చేశారు యువత. తీవ్ర గాయాలపాలైన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఉత్తర్‌ప్రదేశ్ బులంద్‌షహర్ కొత్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. 'వివాహా వేడుక సందర్భంగా డీజే పాటలకు నృత్యాలు చేస్తున్న యువత.. గాయని సప్నా చౌదరీ పాట వేయాలని డీజే నిర్వహిస్తున్న వర్గాన్ని డిమాండ్ చేశారు. వాళ్లు ఆ పాటకు ససేమిరా అన్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం మొదలైందని' ప్రత్యక్షసాక్షులు తెలిపారు.
ఆమె పాట కోసం గొడవ- డీజే మృతి - డీజే సిస్టమ్
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ వివాహ వేడుకలో చెలరేగిన వివాదం ఓ వ్యక్తి మరణానికి దారితీసింది. నృత్యం చేస్తున్నప్పుడు సప్నా చౌదరీ పాట వేయలేదని ఆగ్రహించిన యువత డీజేపై దాడి చేశారు. బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
up violence over sapna chaudhary song leaves one dead
అయితే..ఘర్షణకు దిగిన ఇరు వర్గాలకు నచ్చజెప్పే సమయంలో బాధితుడికి గుండెపోటు వచ్చిందని, అందువల్లనే మరణించినట్లు ప్రాథమికంగా నిర్ధారించామని బులంద్‌షహర్ సీనియర్ ఎస్పీ సంతోష్ కుమార్ సింగ్ తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
ఇదీ చదవండి :ఆన్లైన్ జూదం.. అప్పులపాలవుతున్న బాధితులు
Last Updated : Dec 9, 2020, 3:14 PM IST