తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రెండు దేశాలపై పంజా విసురుతున్న 'బుల్​బుల్​'

బుల్​బుల్ తుపాను భారత్​-బంగ్లాదేశ్​లను వణికిస్తోంది. ​ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు, భీకర గాలులతో తీరప్రాంతాలు బిక్కుబిక్కుమంటున్నాయి. ప్రజలకు అండగా ఉండేందుకు ప్రభుత్వాలు ముందస్తు చర్యలు చేపట్టాయి.

రెండు దేశాలపై పంజా విసురుతున్న 'బుల్​బుల్​'

By

Published : Nov 10, 2019, 3:01 PM IST

Updated : Nov 10, 2019, 6:37 PM IST

బంగాళాఖాతంలో ఏర్పడిన బుల్​బుల్​ తుపాను.. భారత్​-బంగ్లాదేశ్​పై తీవ్ర ప్రభావం చూపుతోంది. సాగర్​ ద్వీపానికి సమీపంలోని భారత్ -​ బంగ్లా సరిహద్దులోని​ మడ అడవుల్లో తీరం దాటింది తుపాను. ఇప్పటికే బంగాల్​, ఒడిశాల్లో ఈదురు గాలులు విజృంభిస్తున్నాయి.

రెండు దేశాలపై పంజా విసురుతున్న 'బుల్​బుల్​'

భయంకర హరికేన్లకు రెండింతలుగా బుల్​బుల్​ ప్రభావం ఉంటుందని అమెరికా వాతావరణ శాఖ పేర్కొంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు బంగాల్​ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆ రాష్ట్ర అధికారులు వెల్లడించారు.

భారీ వర్షాల ధాటికి చెట్లు విరిగి పడడం వల్ల రవాణా వ్యవస్థ స్థంభించిపోతోంది. కొన్ని చోట్ల మనుషుల మీద పడి ప్రాణాలు బలి చేస్తున్నాయి. ఇలాంటి ఘటనల్లో బంగాల్​ రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు మృత్యువాత పడ్డారు.

దీదీకి మోదీ భరోసా..

బంగాల్​లో పరిస్థితిపై ప్రధాని నరేంద్రమోదీ సమీక్షించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీతో సంభాషించిన ఆయన విపత్తు నుంచి బయటపడేందుకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.

బంగ్లాను వణికిస్తోన్న తుపాను..

బంగ్లాదేశ్​లో గంటకు 120 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. తుపాను బంగ్లా భూభాగంలో ప్రవేశించగానే.. తీరప్రాంతాలు సుమారు 1 నుంచి 2 మీటర్ల మేర మునిగిపోతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

బంగ్లాదేశ్​లో బుల్​బుల్​ తుపాను నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం అప్రత్తమైంది. తుపాను ప్రభావిత ప్రాంత ప్రజలను కాపాడుకునేందుకు ముందస్తు చర్యలు చేపడుతోంది. 5 వేలకుపైగా పాఠశాల భవనాలు, మసీదులను పునరావాస కేంద్రాలుగా వినియోగించనున్నారు. శనివారం సాయంత్రం వరకు సుమారు 18 లక్షల మందిని సురక్షిత కేంద్రాలకు తరలించారని విపత్తు నిర్వహణ శాఖ మంత్రి రెహమాన్​ తెలిపారు. కొన్ని గ్రామాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని లౌడ్​స్పీకర్ల ద్వారా ప్రకటనలు చేశారు అధికారులు. నౌకాశ్రాయల్లో అన్నీ కార్యకలాపాలను నిలిపివేసింది ప్రభుత్వం.

ఇదీ చూడండి:వేగంగా బాబ్రీ కేసు విచారణ... త్వరలో తీర్పు వెలువడే అవకాశం!

Last Updated : Nov 10, 2019, 6:37 PM IST

ABOUT THE AUTHOR

...view details