అయోధ్యలో తమకు కేటాయించిన భూమి విషయంపై నేడు సమావేశం కానుంది సున్నీ వక్ఫ్‌బోర్డు. సుప్రీం తీర్పు మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరాల భూమిలో ఎలాంటి నిర్మాణం చేపట్టాలనే అంశంపై తీర్మానించనున్నట్లు యూపీ సున్నీ బోర్డు ఛైర్మన్ జుఫార్ ఫరూఖీ వెల్లడించారు.
"అయోధ్య అంశంలో సుప్రీం తీర్పును గౌరవిస్తామని మేం ఇదివరకే ప్రకటించాం. ప్రభుత్వం కేటాయించిన భూమి పత్రాలపై సమాలోచనలు జరిపేందుకు సమావేశం కానున్నాం. ఆ భూమిలో ఏ విధమైన నిర్మాణం చేపట్టాలనే విషయంపై నిర్ణయం తీసుకోనున్నాం. సుప్రీం మార్గదర్శకాల మేరకు ప్రభుత్వం ఆలయ నిర్మాణానికి ఓ ట్రస్టును ఏర్పాటు చేసింది. అయితే మసీదుకు సంబంధించి ట్రస్టు ఏర్పాటుకు సుప్రీం ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. దీనిపైనా బోర్డు మీటింగ్‌లో చర్చిస్తాం."
-జుఫార్ ఫరూఖీ, ఉత్తర్‌ప్రదేశ్ సున్నీ బోర్డు ఛైర్మన్