ఉత్తర్ప్రదేశ్ హాథ్రస్లో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. సాస్నిలో నాలుగేళ్ల చిన్నారిపై ఆమె బంధువే అత్యాచారానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.
మంగళవారం ఈ ఘటన జరిగినట్టు సర్కిల్ ఆఫీసర్ రుచి గుప్తా తెలిపారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు పేర్కొన్నారు.