పదో తరగతి విద్యార్థుల వాట్సాప్ గ్రూప్‌లో అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు దర్శనమిచ్చాయి. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ బాగ్‌పత్‌లోని బదౌత్ ప్రాంతంలో జరిగింది.
ఇదీ జరిగింది
పదో తరగతి విద్యార్థుల వాట్సాప్ గ్రూప్‌లో అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు దర్శనమిచ్చాయి. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ బాగ్‌పత్‌లోని బదౌత్ ప్రాంతంలో జరిగింది.
ఇదీ జరిగింది
ఓ ప్రైవేటు పాఠశాలలో 'బయాలజీ గ్రూప్ క్లాస్ 10' పేరుతో వాట్సాప్ గ్రూప్‌ను సృష్టించారు. అందులోని అసభ్య ఫొటోలు చూసి నివ్వెరపోయిన తల్లిదండ్రులు.. స్క్రీన్షాట్లు తీసి పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేశారు. గ్రూప్ క్రియేట్ చేసిన నిందితుడు... విద్యార్థుల ఫొటోలను కూడా అడిగినట్లు ఉందని, అయితే ఎటువంటి చిత్రాలు అడుగుతున్నాడో స్పష్టంగా తెలియలేదన్నారు.
రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరపగా.. ఇది నకిలీ గ్రూప్ అని స్పష్టమైంది. నిందితుడు ముందు జాగ్రత్తగా విదేశీ నెంబరుతో గ్రూప్ సృష్టించడం వల్ల ఎవరనేది తెలియలేదు. ప్రొఫైల్‌లో ఆ పాఠశాల బయాలజీ ఉపాధ్యాయుడి ఫొటో ఉంచడం, గ్రూప్‌లో ఉన్న సభ్యుల ఆధారంగా.. తెలిసినవారే ఈ పని చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం ఆ బయాలజీ టీచర్‌కు తెలియకపోవడం గమనార్హం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. బదౌత్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:భర్తను చంపి.. గేదె శవమంటూ పూడ్చిపెట్టి...