దాడికి గురై.. 90 శాతం కాలిన శరీరంతో మృత్యువుతో పోరాడుతున్న ఉన్నావ్ అత్యాచార బాధితురాలని మెరుగైన వైద్యం కోసం లఖ్నవూ నుంచి దిల్లీకి తరలించారు అధికారులు. ప్రస్తుతం దేశ రాజధానిలోని సఫ్దార్జంగ్ ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు.
లఖ్నవూ ఆస్పత్రి నుంచి విమానాశ్రయానికి తరలించే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు. ఎక్కడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. క్షణాల వ్యవధిలోనే విమానాశ్రయానికి తరలించారు.