ఉత్తర్‌ప్రదేశ్‌లో 13 గంటలపాటు, ఎనిమిది ఆసుపత్రుల చుట్టూ తిరిగి.. చివరికి అంబులెన్స్‌లో మృతి చెందింది ఓ నిండు గర్భిణి. నోయిడా-గాజియాబాద్ సరిహద్దులోని ఖోడాకు చెందిన 30ఏళ్ల నీలం.. ఎనిమిది నెలల గర్భిణి. ఒంట్లో కలతగా ఉంటే.. స్థానిక శివాలిక్ ఆసుపత్రికి ఆమెను తీసుకెళ్లాడు భర్త విజేందర్ సింగ్. నీలం పరిస్థితి విషమంగా ఉందని, తనకు చికిత్స అందించే వసతులు తమ దగ్గర లేవన్నారు ఆసుపత్రి సిబ్బంది. దీంతో.. మరో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడా బెడ్ లేదన్నారు. ఇలా దాదాపు 8 ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. మరో ఆసుపత్రిని వెతుకుతున్న సమయంలో అంబులెన్స్‌లోనే కన్నుమూసింది నీలం.
'ముందు మేము ఈఎస్ఐ ఆసుపత్రికి వెళ్లాము. ఆ తర్వాత సెక్టార్-30లో మరో దవాఖానాకు తీసుకెళ్లాను. అక్కడి నుంచి శారద హాస్పిటల్స్, ప్రభుత్వాసుపత్రి, జేపీ, ఫోర్టీస్, మాక్స్.. ఇలా చాలా చోట్ల ప్రయత్నించాం. కానీ, ఎవ్వరూ నా భార్యను చేర్చుకునేందుకు అంగీకరించలేదు. ఆఖరికి నా భార్య అంబులెన్స్‌లోనే ప్రాణాలు కోల్పోయింది.'