తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యూపీలో కాంగ్రెస్ 'క్యాలెండర్ రాజకీయాలు' - ప్రియాంక గాంధీ క్యాలెండర్

ఉత్తర్​ప్రదేశ్​లో పార్టీ బలోపేతం దిశగా మరో అడుగు వేసింది కాంగ్రెస్. పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన చిత్రాలతో ఓ క్యాలెండర్ విడుదల చేసింది. యూపీవ్యాప్తంగా 10లక్షల కాపీలను పంచుతోంది.

UP polls: Cong calendar chronicling Priyanka Gandhi's journey unveiled, 10 lakh copies to be distributed
యూపీలో కాంగ్రెస్ 'క్యాలెండర్ రాజకీయాలు'

By

Published : Jan 21, 2021, 5:44 PM IST

Updated : Jan 21, 2021, 5:58 PM IST

వచ్చే ఏడాది ఉత్తర్​ప్రదేశ్​లో జరిగే శాసనసభ ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతోంది కాంగ్రెస్. పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను ప్రజల్లో శక్తిమంతమైన నేతగా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా... ఆమె రాజకీయ ప్రస్థానాన్ని వివరిస్తూ సాగే క్యాలెండర్​ను ఆవిష్కరించింది. ప్రజా సమస్యలపై ప్రియాంక గాంధీ స్పందన, పోరాటాలకు సంబంధించిన ఫొటోలను ఇందులో పొందుపరిచింది.

యూపీవ్యాప్తంగా 10లక్షల క్యాలెండర్లు పంచనుంది కాంగ్రెస్. ప్రతి వార్డు, గ్రామానికి వీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలకు అధిష్ఠానం సూచించింది. జనాభా ప్రాతిపదికన ప్రతి జిల్లాకు క్యాలెండర్ల పంపిణీ ప్రారంభించారు.

సోన్​భద్ర బాధితుల పరామర్శ

12 పేజీల క్యాలెండర్​లో తొలి పేజీలో సోన్​భద్రలోని ఉంభా నరమేధ బాధిత ఆదివాసి మహిళలను ప్రియాంక ఓదార్చుతున్న ఫొటో ఉంది.

హాథ్రస్​ బాధితురాలి తల్లిని పరామర్శిస్తూ

హాథ్రస్ బాధితురాలి తల్లిని హత్తుకోవడం, పార్టీ కార్యకర్తలను పోలీసుల లాఠీఛార్జ్​ నుంచి కాపాడడానికి యత్నించిన్పటి ఫొటోలను క్యాలెండర్​లో పెట్టారు.

చిన్నారిని ఓదార్చుతూ

ఆజంగఢ్​​లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో ఇబ్బందులపాలైన వారిని కలవడం, బాధిత కుటంబానికి చెందిన ఓ చిన్నారి కన్నీళ్లను ప్రియాంక తుడిచిన ఫొటోలు ఉన్నాయి. అమేఠీ, రాయ్​బరేలీ, హరియాణా, ఝార్ఖండ్ వెళ్లిన నాటి ఫొటోలూ పొందుపరిచారు.

ఉజ్జయిన్​లో

ఇదీ చూడండి:'ఈ మాటలతో ఇక మహిళకు రక్షణ ఉంటుందా?'

Last Updated : Jan 21, 2021, 5:58 PM IST

ABOUT THE AUTHOR

...view details