పోలీసులు తనపై దాడి చేశారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చేసిన ఆరోపణలను ఖండించారు ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు. పోలీసులు దాడి చేశారన్న వాదనల్లో నిజం లేదని వెల్లడించారు.
పౌరసత్వ చట్ట వ్యతిరేక నిరసనల్లో అరెస్టైన విశ్రాంత ఐపీఎస్ అధికారి ఎస్ఆర్ దారాపురి కుటుంబాన్ని కలిసేందుకు శనివారం సాయంత్రం ప్రియాంక గాంధీ వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఆ సమయంలో అక్కడ అత్యంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోలీసులు తన మెడపట్టుకుని నెట్టితే కిందపడిపోయినట్లు ప్రియాంక ఆరోపించారు.
ప్రియాంక గాంధీపై పోలీసులు దాడి చేయడంపై సామాజిక మాధ్యమాల్లో అనేక వార్తలు వస్తున్నాయని, అవన్నీ అవాస్తవమని అడిషనల్ సూపరింటెండెంట్‌కు లేఖ రాశారు.. పోలీసు అధికారిని అర్చనాసింగ్. తన కర్తవ్యాన్ని చిత్త శుద్ధితో నిర్వర్తించినట్లు లేఖలో పేర్కొన్నారు.
" ప్రియాంక గాంధీ యూపీ కాంగ్రెస్ కార్యాలయం నుంచి గోఖలే మార్గ్ గ్రామానికి బయలుదేరారు. ముందుగా నిర్దేశించిన దారిలో కాకుండా ప్రియాంక గాంధీ వాహనం లోహితా మార్గం వైపు వెళ్లింది. భద్రతా కారణాల దృష్ట్యా ఆమె ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో తెలుసుకోవాలనుకున్నాను. కానీ ఆ పార్టీ కార్యకర్తలు సమాచారం ఇవ్వడానికి నిరాకరించారు. ఆ సమయంలో ప్రియాంక గాంధీ.. వాహనం నుంచి దిగి పార్టీ కార్యకర్తలతో కలిసి నడిచి వెళ్లేందుకు ప్రయత్నించారు."
- అర్చనా సింగ్, పోలీసు అధికారి