ఉత్తర్‌ప్రదేశ్ కాన్పూర్ ఎన్కౌంటర్లో 8 మంది పోలీసుల హత్య అనంతరం.. కీలక నేరస్థులపై దృష్టి సారించింది రాష్ట్ర ప్రభుత్వం. కాన్పూర్ ఘటనకు కారకుడైన దూబే కోసం అన్వేషిస్తోన్న ముజఫర్‌నగర్ పోలీసులు.. మరో కీలక నేరస్థుడు హరీశ్ బాలియన్‌పై గురి పెట్టారు. హరీశ్‌ను పట్టిస్తే రూ. 2 లక్షల నజరానా అందిస్తామని ఇప్పటికే ప్రకటించారు. అతని కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.
ఇదీ హరీశ్ నేర చరిత్ర..
నేరస్థుడు హరీశ్ బాలియన్‌పై.. హత్య, దోపిడీ సహా 30 కిపైగా కేసులున్నట్లు ఎస్ఎస్పీ అభిషేక్ యాదవ్ తెలిపారు. అతడు కొన్నేళ్లుగా పరారీలో ఉన్నాడని చెప్పారు.
కాన్పూర్ ఘటన అనంతరం 40 మందిపై హిస్టరీ షీట్ తెరిచారు పోలీసులు. వీరిలో 14 మందిపై యూపీ గ్యాంగ్స్టర్స్, అసాంఘిక కార్యకలాపాల నివారణ చట్టం కింద, 39 మందిపై యూపీ గూండాల నియంత్రణ చట్టం కింద కేసులు నమోదు చేశారు.
ఇదీ చూడండి:లైవ్ వీడియో: వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన వాహనం