తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భార్యను చంపి జాతీయ గీతం పాడిన భర్త! - అఖిలేష్‌

ఓ వ్యక్తి భార్యని చంపి, ఆమె తలను పోలీసుస్టేషన్​లో అప్పగించిన భయంకరమైన ఘటన ఉత్తర్​ప్రదేశ్ జహంగీరాబాద్​లో జరిగింది. భార్యాభర్తల మధ్య జరిగిన చిన్నపాటి గొడవే ఈ దారుణానికి కారణమని పోలీసులు తెలిపారు.

UP man severs wifes head goes to police station sings National Anthem
భార్యను నరికి.. తల చేతిలో పట్టుకుని..!

By

Published : Feb 2, 2020, 5:16 AM IST

Updated : Feb 28, 2020, 8:37 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ జహంగీరాబాద్​లోని బహదూర్పూర్​లో శనివారం ఓ భయానక ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య తల నరికి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోవడం స్థానికులను భయాందోళనకు గురిచేసింది.

ఎస్పీ అరవింద్‌ చతుర్వేది తెలిపిన వివరాల ప్రకారం.. అఖిలేష్‌ రావత్‌ జహంగిరాబాద్‌ పీఎస్‌ పరిధిలోని బహదుర్‌పూర్‌ గ్రామంలో భార్యతో కలిసి నివసిస్తున్నాడు. శనివారం భార్య భర్తల మధ్య వివాదం తలెత్తి ఘర్షణకు దారితీసింది. దీంతో అతను తన భార్యను చంపి దేహం నుంచి తల వేరు చేశాడు. అనంతరం తలను చేతిలో పట్టుకొని పోలీసుస్టేషన్‌కు బయలుదేరాడు.

మార్గమధ్యంలో అతనిని గమనించిన పోలీసులు.. అఖిలేష్‌ను ఆపి తలను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. దీనితో చిన్నపాటి గొడవ జరిగింది. అనంతరం అతను పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. పోలీసులు తలను స్వాధీనం చేసుకున్న వెంటనే నిందితుడు జాతీయ గీతాన్ని ఆలపించడం మొదలు పెట్టాడు. ఇంట్లో వారిద్దరి మధ్య చోటుచేసుకున్న తగాదే ఈ హత్యకు దారి తీసినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి:బడ్జెట్​ 2020: సామాన్యులపై ప్రభావం ఎంత?

Last Updated : Feb 28, 2020, 8:37 PM IST

ABOUT THE AUTHOR

...view details