తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దూబే కోసం పోలీసుల వేట- రౌడీషీటర్ ఇల్లు కూల్చివేత - rowdey sheeter vikas dubey

ఎనిమిదిమంది పోలీసుల మృతికి కారణమైన ఉత్తర్​ప్రదేశ్ రౌడీషీటర్ వికాస్ దూబే ఇంటిని కూల్చేశారు జిల్లా అధికారులు. అతని ఆచూకీ వివరాలు అందిస్తే రూ.50,000 నగదు బహుమతి అందిస్తామని చెప్పారు. ఇంతటి ఘాతుకానికి పాల్పడిన తన కుమారుడిని కాల్చి చంపాలని కోరారు దూబే తల్లి.

vikas
రౌడీషీటర్ వికాస్ దూబే ఇంటి కూల్చివేత

By

Published : Jul 4, 2020, 4:13 PM IST

Updated : Jul 4, 2020, 4:54 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ కాన్పుర్​లో పేరుమోసిన గ్యాంగ్​స్టర్, శుక్రవారం ఎనిమిదిమంది పోలీసుల ప్రాణాలు పోయేందుకు కారణమైన రౌడీషీటర్ వికాస్ దూబే ఇంటిని కూల్చేశారు జిల్లా అధికారులు. మొత్తం ఇంటిని నేలమట్టం చేశారు.

దూబే కోసం పోలీసుల వేట- రౌడీషీటర్ ఇల్లు కూల్చివేత

25 బృందాలు..

ఎన్​కౌంటర్​లో పోలీసుల మృతిని సవాలుగా తీసుకున్న ఉత్తర్​ప్రదేశ్​ పోలీసులు దూబేను పట్టుకునేందుకు 25 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కాన్పుర్ ఐజీ మెహిత్ అగర్వాల్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

"వికాస్ దూబే, అతని అనుచరులను పట్టుకునేందుకు 25 పోలీసు బృందాలను ఏర్పాటుచేశాం. ఇవి రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, ఇతర రాష్ట్రాల్లో దాడులు చేయనున్నాయి."

-మోహిత్ అగర్వాల్, కాన్పుర్ ఐజీ

నిందితుల వద్ద ఏకే 47 తుపాకులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వికాస్​ కోసం రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలు, పొరుగు రాష్ట్రాల్లో గాలిస్తున్నట్లు వివరించారు. వికాస్​కు సంబంధించిన సమాచారాన్ని అందిస్తే రూ.50,000 రివార్డు అందిస్తామని వెల్లడించారు అధికారులు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.

వికాస్ దూబే ఇల్లు కూల్చివేత

500 మొబైల్ ఫోన్లు..

నిఘా విభాగం 500 మొబైల్ ఫోన్ల డాటాను విశ్లేషిస్తోంది. వాటిలోని సమాచారాన్ని రాబట్టేందుకు చూస్తోంది.

రౌడీషీటర్ వికాస్ దూబే ఇంటి కూల్చివేత

'నా కొడుకును కాల్చి చంపండి'

సంచలనం సృష్టించిన కాన్పుర్ ఎన్‌కౌంటర్ కేసులో ప్రధాన నిందితుడైన గ్యాంగస్టర్ వికాస్ దూబే తల్లి తన కుమారుడ్ని కాల్చి చంపాలన్నారు. ఎనిమిది మంది పోలీసులను చంపి తన కుటుంబ అప్రతిష్ఠకు కారణమైన వికాస్ దూబేను క్షమించవద్దన్నారు. అతను చేసింది చాలా పెద్ద నేరమని.. ఒకవేళ పోలీసులు అతణ్ని పట్టుకుంటే వెంటనే కాల్పి చంపాలని కోరారు.

ధ్వంసమయిన వాహనాలు

కాన్పుర్​కు యోగి..

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాన్పుర్​కు చేరుకుని మృతుల కుటుంబాలను పరామర్శించారు. క్షతగాత్రులతో సంభాషించారు. మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం అందిస్తామన్నారు.

ట్రాక్టర్ ధ్వంసం

ఇదీ జరిగింది..

రౌడీషీటర్‌ వికాస్‌దూబేను పట్టుకునేందుకు గురువారం అర్ధరాత్రి పోలీసులు వెళ్లగా..ఓ ఇంటిపై మాటువేసిన దుండగులు పోలీసు బృందంపై బుల్లెట్ల వర్షం కురిపించారు. దీంతో డీఎస్పీ దేవేంద్ర మిశ్రా సహా ముగ్గురు ఎస్సైలు, నలుగురు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 60 క్రిమినల్‌ కేసుల్లో వికాస్‌దూబే నిందితుడిగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:రౌడీషీటర్ల దాడిలో 8 మంది పోలీసులు మృతి

Last Updated : Jul 4, 2020, 4:54 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details