ఉత్తర్‌ప్రదేశ్‌లో 5నుంచి 16 ఏళ్ల పిల్లలపై లైంగిక దాడి చేస్తున్నాడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ జూనియర్ ఇంజినీర్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. యూపీ నీటిపారుదల విభాగంలో పనిచేస్తున్న ఇంజినీర్... గత పదేళ్లుగా విధులు నిర్వహిస్తున్న పలు ప్రాంతాల్లో చిన్నారులను లైంగికంగా హింసించాడని అధికారులు తెలిపారు.
చిత్రకోట్, బాంద, హమీర్‌పుర్‌లో దాదాపు 50 మంది పిల్లలు ఇంజినీర్ వల్ల బాధితులుగా మారినట్లు వివరించారు. అతడి ఆఫీస్ నుంచి పెద్దఎత్తున పిల్లలతో అసభ్యంగా చిత్రీకరించిన వీడియోలతో పాటు, రూ.8 లక్షల నగదు, 8 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్ టాప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.