ఉత్తర్ప్రదేశ్ బలరామ్పుర్లో ఆదివారం దారుణం జరిగింది. రాకేష్ సింగ్ నిర్భిక్ అనే ఓ స్థానిక విలేకరి ఇంటికి దుండగులు నిప్పంటించారు. ఈ ఘటనలో విలేకరితో పాటు అతని స్నేహితుడు.. సజీవ దహనమయ్యారు. ఆ సమయంలో విలేకరి భార్య, పిల్లలు తమ బంధువుల ఇంటికి వెళ్లగా వారికి ప్రాణాపాయం తప్పింది.
ఉత్తర్ప్రదేశ్లో జర్నలిస్ట్ సజీవదహనం - ఉత్తర్ ప్రదేశ్ తాజా వార్తలు
ఉత్తర్ప్రదేశ్లో ఓ స్థానిక జర్నలిస్ట్ ఇల్లును తగలబెట్టారు దుండగులు. ఈ ఘటనలో విలేకరి సహా అతని స్నేహితుడు ప్రాణాలు కోల్పోయారు.
ఇల్లు దగ్ధం.. జర్నలిస్టు మృతి
ఈ నేరానికి పాల్పడ్డ వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అనుమానితులను నాలుగు బృందాలు ప్రశ్నిస్తున్నాయని, ఘటనాస్థలి నుంచి సాక్ష్యాలను సేకరిస్తున్నామని తెలిపారు. ఆర్థిక భరోసా కింద జిల్లా యంత్రాంగం జర్నలిస్టు భార్యకు రూ.5 లక్షల చెక్కును అందజేసింది. బలరాంపుర్ చక్కెర కర్మాగారంలో ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించింది.
ఇదీ చూడండి:రూ.200 అప్పు ఇవ్వలేదని మెకానిక్ హత్య