ఉత్తర్ప్రదేశ్ హర్దోయి జిల్లా ఎస్పీ ఆలోక్ ప్రియదర్శి.. ప్రజల భద్రతకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఓ సరికొత్త ఆలోచనతో ముందుకువచ్చారు. ఇందుకు రాత్రివేళల్లో గస్తీ నిర్వహిస్తే పోలీసులకు ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
ఆ ఆలోచనను ఆచరణలో పెడుతూ.. జిల్లాలో గస్తీ పోలీసులకు రాత్రివేళ ఛాయ్, బిస్కట్లు అందించేలా ఏర్పాటు చేశారు. వీటన్నింటిని సరఫరా చేయాలని అన్ని ఠాణా ఇన్ఛార్జులు, గెజిటెడ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
"దీనివల్ల మూడు లాభాలు ఉన్నాయి. గస్తీ చేసే వాళ్లకు తినడానికి, తాగడానికి ఏమీ దొరకవు. వాళ్లు సాయంత్రం వచ్చి ఉదయం వెళతారు. ఆ పరిస్థితుల్లో వాళ్లేమైనా తినగలిగితే ఉదయం వరకు ఉత్సాహంగా ఉండగలుగుతారు. రెండోది.. గస్తీలో ఉన్నవారికి మా అధికారులే ఆహారం అందిస్తారు. అలా వెళ్లినప్పుడు తనిఖీలు చేస్తారు. ఎవరు ఏం చేస్తున్నారనే విషయం వారికి తెలుస్తుంది. గస్తీలో ఉన్నవారు అప్రమత్తంగా ఉంటారు. దీనివల్ల పోలీసులకు, తనిఖీ అధికారులకు మధ్య సమన్వయం ఏర్పడుతుంది. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే వారికి సహాయం లభిస్తుంది. ఇలా పోలీసు శాఖలో మంచి వాతావరణం ఏర్పడుతుంది."
-ఆలోక్ ప్రియదర్శి, హర్దోయి ఎస్పీ