తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యూపీ 'లవ్​ జిహాద్' ఆర్డినెన్సుకు గవర్నర్ ఆమోదం - బలవంతపు మత మార్పిడులు

బలవంతపు మత మార్పిడిలకు వ్యతిరేకంగా యోగి ఆదిత్యనాథ్ సర్కార్ తీసుకొచ్చిన ఆర్డినెన్సును యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఆమోదించారు. ఇది అమలులోకి వస్తే బలవంతంగా మత మార్పిడిని ప్రోత్సహించే వారికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడనుంది.

UP Guv gives assent to ordinance against forcible religious conversions
'లవ్​ జిహాద్' ఆర్డినెన్సుకు యూపీ గవర్నర్ ఆమోదం

By

Published : Nov 28, 2020, 12:03 PM IST

బలవంతపు మత మార్పిడిలకు వ్యతిరేకంగా ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్సుకు ఆ రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఆమోదముద్ర వేశారు. యోగి ఆదిథ్యనాథ్ నేతృత్వంలోని రాష్ట్ర కేబినెట్ నవంబర్​ 24న ఈ ఆర్డినెన్సును ఆమోదించింది.

ఈ ఆర్డినెన్స్ అమలులోకి వస్తే బలవంతంగా మత మార్పిడిలకు పాల్పడేవారికి 10ఏళ్ల వరకు జైలు శిక్ష పడనుంది. మత మార్పిడి కోసమే వివాహం చేసుకున్నట్లైతే.. ఆ వివాహాన్ని చెల్లుబాటుకానిదిగా పరిగణిస్తారు.

ఇటీవలి కాలంలో భాజపా పాలిత రాష్ట్రాలైన ఉత్తర్​ప్రదేశ్, హరియాణా, మధ్యప్రదేశ్​ రాష్ట్రాలు ఈ తరహా ఆర్డినెన్సులు తీసుకొస్తున్నట్లు ప్రకటించాయి. ప్రేమ, పెళ్లి పేరిట హిందు మహిళలను బలవంతంగా ఇస్లాం మతంలోకి మారేలా చేస్తున్నారని, వాటిని అరికట్టేందుకు ఈ ఆర్డినెన్సులు ఉపయోగపడతాయని చెబుతున్నాయి. ఈ బలవంతపు మత మార్పిడులనే 'లవ్​ జిహాద్​'గా అభివర్ణిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details