ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో.. శాంతిభద్రతల అంశాన్ని ఎత్తిచూపి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, దళితులు అణిచివేతకు గురవుతున్నట్లు ఆరోపించారు. ఈ తరుణంలో గత తొమ్మిదేళ్లకు సంబంధించిన నేర గణాంకాలను విడుదల చేసింది యోగీ సర్కార్. భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రిమినల్ కేసులు గణనీయంగా తగ్గాయని ఆ రాష్ట్ర హోశాంఖ ప్రతినిధి తెలిపారు. ఇందుకు జీరో- టోలరెన్స్ విధానమే ప్రధాన కారణమని వెల్లడించారు.
2016తో పోలిస్తే 2020 నాటికి 74.50 శాతం నేరాల్లో తగ్గుదల ఏర్పడిందని అన్నారు. అదే అత్యాచార కేసుల విషయంలో 2013తో పోలిస్తే 25.94 శాతం, 2016తో చూస్తే 38.74 శాతం, 2019తో పోలిస్తే 28.13 శాతం తగ్గుముఖం పడినట్లు ఆయన తెలిపారు.
ఆ కేసుల్లోనూ తగ్గుదల...