తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అయోధ్య అభివృద్ధి ప్రాంత విస్తరణకు ఆమోదం - రామ మందిర నిర్మాణం

అయోధ్య అభివృద్ధి ప్రాంతాన్ని పెంచుతూ ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల.. మరో 300కు పైగా గ్రామాలు ఈ అభివృద్ధి ప్రాంత పరిధిలో చేరనున్నాయి.

yogi adityanath
అయోధ్య అభివృద్ధి ప్రాంత విస్తరణకు ఆమోదం

By

Published : Dec 11, 2020, 10:58 PM IST

అయోద్య అభివృద్ధి ప్రాంతాన్ని విస్తరించడానికి ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గోండా, బస్తీ జిల్లాలకు చెందిన మూడు వందలకు పైగా గ్రామాలను కలుపుతూ ఈ విస్తరణ జరగనుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్​ అధ్యక్షతన.. శుక్రవారం జరిగిన కేబినెట్​ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సరిహద్దును పెంచడం ద్వారా అయోధ్య అభివృద్ధి జోన్​(ఏడీజెడ్​)​ విస్తరణ సాధ్యమవుతుందని యోగి ఆదిత్యానాథ్​ తెలిపారు.

ఏడీజెడ్ కింద 343 రెవెన్యూ గ్రామాలు కలవనున్నాయని అధికారులు తెలిపారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఆగస్టులో శంకుస్థాపన చేశారు. ఈ ఆలయ నిర్మాణం చేపట్టడం వల్ల పర్యటకుల సంఖ్య పెరుగుతుందని యూపీ ప్రభుత్వం తెలిపింది.

ఇదీ చూడండి:సుబ్రమణ్య భారతి బహుముఖ ప్రజ్ఞాశాలి: ప్రధాని

ABOUT THE AUTHOR

...view details