ఉత్తర్ప్రదేశ్లో నెలకొన్న తాజా పరిస్థితులపై 104 మంది విశ్రాంత ఐఏఎస్ అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం విద్వేష రాజకీయాలకు ప్రధాన కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. మత మార్పిడిలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన అత్యవసర ఆదేశాన్ని(ఆర్డినెన్సు) వెంటనే వెనక్కి తీసుకోవాల్సిందిగా సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి లేఖ రాశారు.
రాష్ట్రంలో మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని ఇటీవల జరిగిన పలు దాడులను అందులో ప్రస్తావించారు. సీఎం సహా రాష్ట్రంలోని చాలా మంది రాజకీయ నేతలు రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరముందన్నారు.