కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోన్న వేళ.. దాన్ని కట్టడి చేయడంలో ఉత్తర్‌ప్రదేశ్ చేపడుతున్న చర్యలను పాకిస్థాన్ మీడియా ప్రశంసించింది. వైరస్‌ను కట్టడి చేసేందుకు యోగి ప్రభుత్వం అవలంభించిన విధానం సరైందని పాకిస్థాన్ మీడియా అభిప్రాయపడింది. కరోనా వైరస్ వ్యాప్తి అడ్డుకట్టవేసేందుకు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలుపరిచినట్లు పాకిస్థాన్‌కు చెందిన ‘డాన్’ పత్రిక సంపాదకులు ఫహద్ హుస్సేన్ తెలిపారు.
పాకిస్థాన్ జనాభాతో దాదాపు సమానంగా(పాకిస్థాన్ 20కోట్లు, ఉత్తర్‌ప్రదేశ్‌లో 22కోట్ల జనాభా) ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లో కరోనా వైరస్ తీవ్రతను పాకిస్థాన్‌తో పోల్చిచూసింది. దీనిలో భాగంగా కరోనా మరణాల రేటు పాకిస్థాన్‌లో కంటే ఉత్తర్‌ప్రదేశ్‌లోనే తక్కువని ఫహద్ హుస్సేన్ పేర్కొన్నారు. అదే దాదాపు 11కోట్ల జనాభా కలిగిన మహారాష్ట్రలో మాత్రం కరోనా మరణాల రేటు పాకిస్థాన్ కంటే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. ఆ రాష్ట్రం తీసుకున్న అసంబద్ధ నిర్ణయాల కారణమే అక్కడ వైరస్ అదుపులోకి రాలేదని అభిప్రాయపడ్డారు. ఈ వైరస్‌ను అడ్డుకట్ట వేయడంలో ఉత్తర్‌ప్రదేశ్ వ్యవహరించిన విధానమే సరియైందని స్పష్టం చేశారు.