తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహారాష్ట్రలో మరో 22,543 మందికి కరోనా

ప్రపంచంలో ఎక్కువ కేసులు కలిగిన దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. దేశంలో ఎక్కువ కేసులు గల రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందు వరుసలో ఉండగా..., తమిళనాడు, కర్ణాటక, ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. తాజాగా మహారాష్ట్ర​లో 22,543 మంది వైరస్​ బారిన పడ్డారు. తమిళనాడులో మొత్తం కేసుల సంఖ్య 5 లక్షలు దాటింది.

UP Corona meter: 80 dead, 6,239 test +ve
తమిళనాడులో 5 లక్షలు దాటిన కరోనా కేసులు

By

Published : Sep 13, 2020, 7:11 PM IST

Updated : Sep 13, 2020, 8:37 PM IST

దేశంలో కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా.. వైరస్​ తగ్గుముఖం పట్టడంలేదు లేదు. రోజూ అధిక సంఖ్యలో కేసులు బయటపడుతూనే ఉన్నాయి. మహారాష్ట్రలో తాజాగా 22,543 మందికి పాజిటివ్​గా తేలింది. మరో 416 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 29,531కి చేరింది. రాష్ట్రంలో మొత్తం 10,60,308 మంది బాధితులు ఉన్నారు.

కర్ణాటకలో తాజాగా 9,894 కేసులు వెలుగు చూశాయి.. మరో 104 మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం 4,59,445 మంది బాధితులు ఉండగా.. అందులో 99,203 మంది చికిత్స పొందుతున్నారు.

  • ఉత్తర్​ప్రదేశ్​లో తాజాగా 6,239 కేసులు వెలుగు చూశాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 3,12,036కు చేరింది. 68,122 యాక్టివ్​ కేసులు ఉండగా.. 2,39,485మంది కోలుకున్నారు.
  • తమిళనాట రోజూ సగటున 5 వేల కేసులు బయటపడుతున్నాయి. తాజాగా మరో 5,693 మందికి పాజిటివ్​గా తేలింది. ఒక్కరోజులో 74మంది మృతి చెందగా.. 5,717 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో 5,02,759 మంది బాధితులు ఉండగా.. 8,381 మంది వైరస్​ కారణంగా ప్రాణాలు విడిచారు.
  • దిల్లీలో తాజాగా రికార్డు స్థాయిలో 4,235 కేసులను గుర్తించారు. దీంతో మొత్తం 2.18 లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. ఇప్పటివరకు 4,744 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఒడిశాలో తాజాగా 3,913మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. మరో 10 మంది మృతి చెందగా.. మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 626కు చేరింది.. మొత్తం బాధితుల సంఖ్య 1.50 లక్షలు దాటింది.
  • కేరళలో కొత్తగా 3,139 కేసులు వెలుగు చూశాయి. రాష్ట్రంలో 30,072 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. మరో 77,703 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.
  • పంజాబ్​​లో కొత్తగా 2,628 కేసులు వెలుగు చూశాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 79,679గా ఉండగా.. 2,356 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • జమ్ముకశ్మీర్​లో మరో 1,686 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది.
  • గుజరాత్​లో మొత్తం 1,13,662 మంది బాధితులు ఉన్నారు. వీరిలో 3,213 మంది మృతి చెందారు.
  • రాజస్థాన్​లో మరో 731 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 1,01436కు చేరింది.
  • పుదుచ్చేరిలో తాజాగా నమోదైన కేసులతో కలిపి... మొత్తం 19,821 మంది బాధితులు ఉన్నారు. వీరిలో 14,580 మంది డిశ్చార్జ్​ అయ్యారు.
Last Updated : Sep 13, 2020, 8:37 PM IST

ABOUT THE AUTHOR

...view details