మహిళతో అసభ్యంగా ప్రవర్తించటమే కాక అడ్డొచ్చిన వ్యక్తిని తుపాకీతో కాల్చిన ఓ పోలీస్ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ బులంద్‌షహర్ జిల్లా కమల్పుర్లో జరిగింది.
మహిళతో అసభ్య ప్రవర్తన- అడ్డొచ్చిన వ్యక్తిపై కాల్పులు
ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఓ పోలీస్ అధికారి మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. అంతేకాక అడ్డొచ్చిన వ్యక్తిని తుపాకీతో కాల్చాడు. ఈ కేసులో నిందితుడితోపాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు.
మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన పోలీస్ అరెస్ట్
కమల్పుర్లో వివాహ వేడుకకు వెళ్తున్న ఓ మహిళతో సర్వేశ్ అనే పోలీస్ అధికారి, తన స్నేహితులతో కలిసి మద్యం తాగి అసభ్యంగా ప్రవర్తించాడు. అడ్డుకోబోయిన కిషన్‌లాల్ అనే వ్యక్తిని తుపాకీతో కాల్చాడు. గాయపడిన కిషన్‌లాల్ ప్రస్తుతం వారణాసిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో సర్వేశ్తోపాటు అతడి స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండి:స్కార్పియో- లారీ ఢీ- 8మంది మృతి